రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది: బైరెడ్డి రాజశేఖర్​ రెడ్డి

author img

By

Published : Jan 19, 2023, 10:14 AM IST

Bireddy Rajashekar Reddy

Byreddy Rajashekar Reddy: సీమకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని రాయలసీమ స్టీరింగ్​ కమిటీ కన్వీనర్​ బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి ధ్వజమెత్తారు. ఆదోనిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన కాకుండా.. రోడ్ కం బ్యారేజ్‌ నిర్మించాలని డిమాండ్ చేశారు.

రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది

Byreddy Rajashekar Reddy : వైసీపీ ప్రభుత్వం సీమకు ద్రోహం చేస్తోందని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఇంత వరకు కర్నూలుకు హైకోర్టు రాలేదని, బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఆదోనిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. సిద్దేశ్వరం వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన కాకుండా.. రోడ్ కం బ్యారేజ్‌ నిర్మించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఆదోనిని మట్కా కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. సీమకు జరిగిన ద్రోహానికి నిరసనగా.. ఈ నెల 28న రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సిద్దేశ్వరం దగ్గర భారీ ప్రదర్శన చేస్తామని తెలిపారు.

"రాయలసీమను సస్యశ్యామలం చేసే కృష్ణా-పెన్నా ప్రాజెక్ట్​.. స్థానంలో తీగల వంతెన కట్టాలని నిర్ణయం తీసుకున్నావు. దాని కోసం 1200 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. సెల్ఫీలు దిగడానికో, లేకపోతే డ్యూయెట్​లు పాడడానికో కట్టే బ్రిడ్జ్​.. రాయలసీమకు అవసరం లేదు. ఈ నెల 28న 11 గంటలకు సంగమేశ్వరంలో దర్శనం చేసుకుని సిద్దేశ్వరంలో భారీ ప్రజా ప్రదర్శన చేస్తాం"- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.