ETV Bharat / state

lokesh in kurnool : సర్పంచుల బిల్లులు చెల్లించాలి.. ఆర్యవైశ్యులకు టీడీపీ అండ : నారా లోకేశ్

author img

By

Published : May 8, 2023, 8:08 PM IST

Welcome to Nara Lokesh : యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు అపూర్వ స్వాగతం లభించింది. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్పంచులు చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఆర్యవైశ్యులు నిరాదరణకు గురయ్యారని అన్నారు.

Etv Bharat
Etv Bharat

Welcome to Nara Lokesh : యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్​కు కర్నూలు నగరంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం ఎస్టీబీసీ కళాశాల మైదానం నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు స్వాగతం పలికారు. కొండారెడ్డి బురుజు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు. అంబేడ్కర్ సర్కిల్, గడియారం ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో జనం కిక్కిరిసి పోయారు.

సర్పంచుల ఆత్మహత్య బాధాకరం.. గ్రామాల్లో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల బిల్లులు మంజూరు కాక‌పోవ‌డంతో అప్పుల పాలైన స‌ర్పంచులు ఆత్మహ‌త్యల‌కు పాల్పడుతుండ‌డం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్‌ బాదం ధనలక్ష్మిది ఆత్మహ‌త్య కాదు, వైఎస్సార్సీపీ స‌ర్కారు చేసిన హ‌త్య అని ధ్వజమెత్తారు. పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి వ‌చ్చే ఆర్థిక సంఘం నిధులు 8,660 కోట్లను మ‌ళ్లించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. స‌ర్పంచులు చేసిన పనుల‌కు బిల్లులు కూడా చెల్లించ‌క‌పోవ‌డ‌మే ఈ బ‌ల‌వ‌న్మర‌ణాల‌కి కార‌ణమని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి స‌ర్పంచుల బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించేందుకు చ‌ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధ‌న‌ల‌క్ష్మి మృతికి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారు బాధ్యత వ‌హిస్తూ కోటి ప‌రిహారం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వైఎస్సార్సీపీ పాలనలో దాడులు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయా..? కానీ వైఎస్సార్సీపీ నేతలు మాత్రం వారి పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తాపై దాడి చేసి గంజాయి కేసు పెట్టారని నారా లోకేశ్ ఆరోపించారు. కర్నూలులోని శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనేనని గుర్తు చేశారు.

రోశయ్య పేరిట మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తాం.. రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదని గుర్తు చేస్తూ.. రోశయ్య కాంగ్రెస్ అయినా మాకు ఆయనంటే గౌరవం.. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తాం.. ఆయన పేరిట మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రోశయ్య చనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయిందని.. ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు వైఎస్సార్సీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయిందని.. తప్పకుండా వైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని లోకేశ్ వివరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.