ETV Bharat / state

అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠను అడ్డుకున్న అధికారులు

author img

By

Published : Aug 4, 2020, 8:13 PM IST

నాగలదిన్నెలో అమ్మవారి(పెద్దమ్మ) విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన గ్రామస్థులు స్థానిక తహసీల్దార్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.

nandavaram village people protest at tahsildar office for stopping of goddess statue programme
నందవరం తహసీల్దార్​ కార్యాలయం వద్ద గ్రామస్థులు నిరసన

కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో పెద్దమ్మ అమ్మవారి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు స్థానిక తహసీల్దార్​ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వీరికి భాజపా నాయకులు సంఘీభావం తెలిపారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగానే విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకోవడం సరికాదని భాజపా నాయకులు అన్నారు.

ఇదీ చదవండి :

అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.