ETV Bharat / state

కర్నూలు జిల్లాలో స్తంభించిన జనజీవనం

author img

By

Published : Sep 20, 2019, 11:57 AM IST

Updated : Sep 20, 2019, 5:38 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లాలో జనజీవనం స్తంభించింది. పంటపొలాలు నీటమునగ్గా, రహదారులపై వరద నీరు చేరింది. పలు కాలవ గట్లు తెగిపోవడంతో గ్రామాల్లోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో జిల్లాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

వరద గుప్పిట కర్నూలు జిల్లా

వరద గుప్పిట కర్నూలు జిల్లా

4రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్నూలు జిల్లా తడిసి ముద్దమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు నీట మునిగడంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. డోన్, నంద్యాల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, హాలహర్వి, నందికొట్కూరు, ఆత్మకూరు, పాణ్యం, తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హాలహర్వి వద్ద వాగు ఉద్ధృతికి తాత్కాలిక వంతెన కోతకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కర్నూలు-బళ్లారి జాతీయ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హొళగుంద మండలంలో వేదవతి నది ఉగ్రరూపం దాల్చడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆళ్లగడ్డ మండలం అహోబిళం వద్ద కాల్వ కట్ట తెగిపోవటంతో విద్యుత్ సబ్ స్టేషన్లో భారీగా వర్షం నీరు నిలిచింది. ఆళ్లగడ్డ మండలంలో బాచేపల్లి తండా వద్ద తెలుగుగంగ 23వ బ్లాక్ కట్ట తెగిపోయి వందల ఎకరాల పంటపొలాలు నీటి మునిగాయి. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో కర్నూలు జిల్లా వాసులున్నారు.

ఇదీ చదవండి : నంద్యాల డివిజన్ పరిధిలో భారీ వర్షం

Intro:AP_RJY_97_31_KADIYAMLO_UPANDHUKUNNA_VINAYAKUNI_VIGRAHALU_AMMAKALU_AV_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు...AP10166
తూర్పుగోదావరి జిల్లా కడియంలో రాజస్థాన్కు చెందిన వారు ప్రతి ఏడాది ఎక్కువ మొత్తంలో సంవత్సరం పొడవున వినాయకుని విగ్రహాలు తయారుచేస్తుంటారు. ఆకట్టుకున్న రంగులతో వివిధ రూపాల్లో వందల సంఖ్యలో విగ్రహాలు తయారు చేస్తారు .కడియంలో అయితే నచ్చిన విగ్రహం లభిస్తుందని నమ్మకంతో వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. వినాయకచవితి చవితి సోమవారమే కాబట్టి ఎక్కువమంది వాహనాలతో వచ్చి విగ్రహాలను కొనుక్కొని వెళ్తున్నారు. ఎత్తైన విగ్రహాలు కావడంతో క్రేన్ తో వాహనాల పైకి ఎక్కించ డాన్ని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
Last Updated : Sep 20, 2019, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.