ETV Bharat / state

TENSION: వినాయక నిమజ్జనాన్ని అడ్డుకున్న పోలీసులు..యువకుల ఆందోళన

author img

By

Published : Sep 12, 2021, 3:38 PM IST

Updated : Sep 12, 2021, 7:34 PM IST

వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత
వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత

రాష్ట్రంలో మొదట నుంచి వినాయక చవితి పండగపై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేట్​ స్థలాల్లో ఉత్సవాలకు హైకోర్టు అనుమతివ్వడంతో ప్రజలు పండగ జరుపుకున్నారు. అయితే నిమజ్జనానికి పోలీసులు అనేక షరతులు విధించారు. ఊరేగింపులో డీజేలు వాడొద్దని తెలిపారు. అయితే ఈరోజు పలుచోట్ల జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. డీజేలు ఉపయోగించవద్దని హెచ్చరించారు. దీంతో యువకులు ఆందోళనకు దిగారు.

వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా ఆత్మకూరులో చేపట్టిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డ్రమ్స్ వాయిద్యాల మధ్య యువకులు, చిన్నారుల నృత్యాలతో శోభయాత్ర ప్రారంభం కాగా...డ్రమ్స్​కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. శోభాయాత్రను ఆపేసి యువకులు నిరసనకు దిగారు. చాలాసేపటి తర్వాత పోలీసులు దిగిరావటంతో యువకులు శాంతించారు. శోభాయాత్ర తిరిగి ఉత్సహంగా కొనసాగింది.

గూడురులో ఉద్రిక్తత...

గూడూరు నగర పంచాయతీలో ఆదివారం వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత కొనసాగింది. నిమజ్జనానికి డీజే అనుమతి లేదని పోలీసులు తెలపడంతో బస్టాండ్ కూడలి వద్ద పెద్ద ఎత్తున స్థానికులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. సీఎం తండ్రి వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక నిమజ్జనానికి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఉదయం ప్రారంభమైన నిరసన ఇంకా కొనసాగుతునే ఉంది. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు. అయినప్పటికీ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆలూరు వినాయక నిమజ్జనంలో డిజే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిమజ్జనానికి వెళ్లకుండా నిలిపేశారు. మూడు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన యువకులు... డీజేతో నిమజ్జనానికి బయలు దేరగా పోలీసులు అడ్డుకున్నారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు లో వినాయక ఊరేగింపును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డప్పులతో ఊరేగింపుగా వెళ్తున్న విగ్రహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రహదారి పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిన్న వైకాపాకు చెందిన నాయకులు డప్పులతో రాత్రి వరకు ఊరేగింపు చేశారని... తాము చేస్తే తప్పు ఏముందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి:

విజయసాయిరెడ్డి సలహాతోనే మటన్ మార్ట్‌లు: బుద్దా వెంకన్న

Last Updated :Sep 12, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.