ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@7am

author img

By

Published : Dec 28, 2022, 6:58 AM IST

..

7am topnews
ప్రధానవార్తలు7am

  • వేల సంఖ్యలో వృద్ధాప్య, వితంతు పింఛన్లకు కోత
    Pensioners Concerns: కన్నవారి ఆదరణ కరవై, కట్టుకున్న వారి తోడుకు దూరమై.. పింఛన్ మీదే ఆధారపడి బతుకుతున్న వారు ఎందరో. అలాంటి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తూ.... వారి గుండెకోతకు కారణమవుతోంది.... రాష్ట్ర ప్రభుత్వం. జనవరి నుంచి పెంచిన కొత్త పింఛన్లు ఇస్తామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్‌.... లేనిపోని సాకులతో పింఛన్లు తీసివేయడంపై నిరుపేదలు లబోదిబోమంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కలెక్టర్లూ ప్రెస్‌మీట్లు పెట్టండి.. గట్టిగా తిట్టండి..!: సీఎం జగన్‌
    CM YS Jagan Review Meeting: వివిధ కారణాలతో గతంలో సంక్షేమ పథకాలు అందని 2లక్షల 79 వేల మంది లబ్ధిదారులకు, 590 కోట్ల 91లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగన్‌. పింఛన్ల తొలగింపుపై నోటీసులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పింఛన్‌ తీసేయడానికి వీల్లేదన్న జగన్‌.. ఒకవేళ ఎవరైనా దుష్ప్రచారం చేస్తే.. కలెక్టర్లు గట్టిగా తిట్టిపోయాలని.. ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గ్రానైట్‌ తవ్వకాల ఎన్‌వోసీ జారీ అంశంలో మంత్రి విడదలకు హైకోర్టు నోటీసులు
    NOTICES TO MINISTER RAJINI: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల భూముల్లో గ్రానైట్‌ మైనింగ్‌ లీజు అంశంపై.. మంత్రి రజిని, ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ, మరో ఎంపీ మోపిదేవి సతీమణి సహా పలువురికి.. హైకోర్టు నోటీసులు ఇచ్చింది. భూములు వదులుకోవాలని అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టు దృష్టికి తెచ్చిన బాధితులు.. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఎన్‌వోసీలను రద్దు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీబీఐతో న్యాయం జరక్కపోతే.. ఎక్కడికి వెళ్లాలి : అయేషా తల్లిదండ్రులు
    AYESHA PARENTS : 15 ఏళ్లు గడిచినా అయేషా మీరా హత్య కేసులో నిందితులకు శిక్ష పడలేదని.. ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. అసలు నిందితులు దర్జాగా తిరుగుతుంటే.. మధ్యలో కొందరు అమాయకులను అరెస్టు చేసి హడావిడి చేశారని వాపోయారు. సీబీఐ విచారణ చేసినా న్యాయం జరక్కపోతే.. ఇక ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆన్​లైన్​లో సెక్స్​ చాట్​.. నెలకు రూ.10లక్షల ఆదాయం.. భర్తకు అడ్డంగా బుక్కైన మహిళ
    ఓ యాప్​లో సెక్స్ చాట్​ చేస్తూ బాగా డబ్బులు సంపాదించేది ఓ మహిళ. అలా ఓ యువకుడికి అర్ధనగ్న కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యింది. ఆ యువకుడు మహిళ.. అర్ధనగ్న పొటోలను ఆమె భర్తకు పంపాడు. అప్పుడామె భర్త ఏం చేశాడంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం
    ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు సజీవదహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆర్థిక సంక్షోభంలో పాక్​.. అమెరికాలోని ఎంబసీ ఆస్తులు అమ్మకం!
    అమెరికాలోని తమ ఎంబసీ ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైంది. వాషింగ్టన్‌లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అప్పులు తీసుకుంటున్నారా?.. ఈ తప్పులు మాత్రం చేయొద్దు!
    ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో రుణాలు తీసుకుంటారు. ఎంతటి వారైన అప్పు తీసుకోవడం సహజం. అయితే ఇలాంటి సందర్భంలో రుణగ్రహీతలు అప్పులకు సంబంధించి కొన్ని నిబంధనలు అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శ్రీలంకతో సిరీస్‌కు వారంతా దూరం.. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య.. సూర్యకు ప్రమోషన్!
    శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత్‌ జట్టు సారథిగా హార్దిక్​ పాండ్యను బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఈ సిరీస్​కు కోహ్లీ, రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్ దూరమయ్యారు. సూర్య కుమార్​కు వైస్​ కెప్టె్న్​గా ప్రమోషన్​ లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RC15 అదిరిపోయే అప్డేట్​.. DSPతో ఊర్వశీ రౌతేలా ఏం చేసిందో తెలుసా?
    స్టార్​ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో​ మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్​సీ 15. ఈ చిత్రం నుంచి మరో అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. మరోవైపు, చిరంజీవి బాస్​ పార్టీ సాంగ్​కు ప్రముఖ బాలీవుడ్​ నటి ఊర్విశీ రౌతేలా.. దేవిశ్రీ ప్రసాద్​తో కలిసి మాస్​ స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్​ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.