ఈనెల 22న పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్ష.. అభ్యర్థులకు ఇవి తప్పనిసరి

author img

By

Published : Jan 20, 2023, 10:53 PM IST

police recruitment

Police Recruitment Exam : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్ష జరగనుంది. మొత్తం 6,100 పోస్టులకు 5,03,486మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు వెల్లడించిన అధికారులు.. పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని.. 9గంటల నుంచే లోపలికి అనుమతిస్తామని.. 10గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుంతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు వెంట తెచ్చుకోవాల్సిన గుర్తింపు కార్డుల వివరాలు వెల్లడించారు.

Police Recruitment Exam : ఈ నెల 22న నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 10 గంటల తర్వాత నిమిషం దాటినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షను ముందుగా పూర్తి చేసినా 1:00 గంట వరకు హాలులోనే ఉండాలని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ ఏదైనా ఒక ఫొటో గుర్తింపు కార్డును తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్, బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. మొత్తం 6,100 పోస్టులకు 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

బాపట్ల జిల్లాలో.. బాపట్ల జిల్లావ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఏపీ.ఎస్.ఎల్.పి.ఆర్.బి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షా పత్రాలు భద్రపరిచేందుకు చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​ను ఎస్పీ పరిశీలించారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరిసర ప్రాంతాలు, , పార్కింగ్, వెలుతురు, తాగు నీటి సదుపాయాలు పరిశీలించారు. అభ్యర్థులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి కేంద్రం వద్ద గట్టి భద్రతా, బందోబస్త్ చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి.మహేష్, చీరాల సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ పి.శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో.. పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ జీఆర్.రాధిక వెల్లడించారు. ఆయా వివరాలను ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శ్రీకాకుళం రీజియన్ పరిధిలోని శ్రీకాకుళం టౌన్, రూరల్, ఎచ్చెర్ల, పొందూరు. టెక్కలి రీజియన్ పరిధిలోని టెక్కలి ఐతం, నరసన్నపట, కాశీబుగ్గ, కోటొమ్మాళి కేంద్రాలుగా మొత్తం 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 23,735 మంది అభ్యర్థులు హాజరు కానుండగా.. వీరిలో పురుషులు 18,151, మహిళలు 5,584 ఉన్నట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్, పరీక్ష నోడల్ అధికారి డీఎస్పీ జి.ప్రేమ్ కాజాల్, డీఎస్పీలు పాల్గొన్నారు.

ఇవి చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.