family member certificate: తహసీల్దారు కార్యాలయం ఎదుట.. మహిళ నిరాహార దీక్ష

author img

By

Published : Nov 24, 2021, 11:06 PM IST

మహిళ నిరాహార దీక్ష

ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ ఇవ్వట్లేదని పెనుగంచిప్రోలుకు చెందిన మహిళ తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష(Woman goes on a hunger strike ) చేపట్టారు.

ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నెలల తరబడి తిప్పుతున్నారంటూ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన బొజ్జవరపు ప్రమీల మంగళవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష(hunger strike ) చేపట్టారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ప్రమీల భర్త బొజ్జవరపు ఆనంద్​శేఖర్ 8 నెలల క్రితం​​ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆ తరువాత భర్త​ కుటుంబ సభ్యులతో ప్రమీలకు విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ కోసం ప్రమీల అర్జీ దాఖలు చేయగా.. ఆమె భర్త కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు.

ఫలితంగా.. అధికారులు ధ్రువపత్రం మంజూరును పెండింగ్​లో ఉంచారు. కాగా.. ఈ విషయమై తహసీల్దారు పద్మజ మాట్లాడుతూ.. ప్రమీల భర్త కుటుంబ సభ్యుల అభ్యంతరం వల్లే సర్టిఫికెట్​ పెండింగ్​లో ఉంచామన్నారు.

ఇదీ చదవండి: HC ON WOMEN POLICE SECRETARIES: మహిళా పోలీసు కార్యదర్శుల నియామకంపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.