చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా'.. మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా!

author img

By

Published : Aug 4, 2022, 11:06 AM IST

చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా
చనిపోయిన వ్యక్తికీ 'సంక్షేమ బావుటా ()

ఆయనో రైతు.. తొమ్మిదేళ్ల కిందట మృతిచెందారు.. కానీ ఆయనకు మూడేళ్లుగా పింఛను, రైతు భరోసా సొమ్ము అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజులపాటి సత్యనారాయణ 2013లో మృతి చెందారు. ఆయనకు గత మూడేళ్లుగా వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద రూ. 33,500.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ. 34,500 ఇచ్చినట్లు.. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దీనికి సంబంధించిన 'సంక్షేమ బావుటా' పత్రాన్ని అందజేశారు. దీనికి ఆశ్చర్యపోయిన సత్యనారాయణ కుమారుడు జగదీశ్‌ ఆ సొమ్ము ఎవరు తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. స్థానిక వాలంటీరును ప్రశ్నించగా అదే పేరుతో మరో వ్యక్తి ఇంకో వార్డులో ఉండి ఉంటారని తెలిపినట్లు జగదీశ్‌ పేర్కొన్నారు. దీనిపై ఎంపీడీవో ఏవీ నాంచారరావును 'ఈనాడు' వివరణ కోరగా ఈ విషయం ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతామని తెలిపారు.

ఇవీ చూడండి : ఎన్నికల్లో ఉచిత హామీలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. 7 రోజుల్లోగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.