ETV Bharat / state

విజయవాడలో ప్రమాదఘంటికలు

author img

By

Published : Sep 5, 2020, 7:02 AM IST

vijyawada first in roada accidents
విజయవాడలో రోడ్డు ప్రమాదాలు

రయ్ .. రయ్ ... మంటూ దూసుకుపోయే ద్విచక్రవాహనాలు వాటి పై ఉడుకునెత్తురు ఎగిసిపడితే యువత అడ్డూ ఆపు లేని వేగం .. వెరసి గాల్లో ప్రాణం. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల జాబితాలో విజయవాడ నగరం ప్రథమ స్థానంలో ఉంది . అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ తో ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

విజయవాడలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019లో జరిగిన రోడ్డు 95.3 శాతం ప్రమాదాలు జరిగితే.. 97.7 శాతం మరణాలు రేటు నమోదైంది. అంటే ప్రమాదాల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ప్రమాదాల్లో యువతే ఎక్కువగా బలవుతున్నారు. ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదికలోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 53 నగరాల్లో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో విజయవాడ 2.1 శాతం ఉంది. అత్యధిక ప్రమాదాలు జరిగిన నగరాల జాబితాలో విజయవాడ 15వ స్థానంలో ఉంది. 2018 తో పోలిస్తే 2019 లో విజయవాడలో 9.9 శాతం ప్రమాదాలు తగ్గాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన ' ప్రమాద మరణాలు - ఆత్మహత్యల సమాచార నివేదిక -2019 ' లో వివరాలను వెల్లడించింది.

ఎస్సీఆర్ బీ -2019 నివేదిక ప్రకారం గతేడాది జరిగిన ప్రమాదాల్లో ద్విచక్రవాహనాలకు సంబంధించినవే ఉండగా .. మృత్యువాత పడినవారు వీళ్లే అధికంగా ఉన్నారు. నగరంలో 2019 లో రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 355 మందిలో 201 మంది ద్విచక్రవాహన ప్రమాదాల వల్ల గాయపడగా... 96 మంది మృత్యువాతపడ్డారు. బైక్​పై వెళ్లేవారిలో ప్రధానంగా హెల్మెట్ ధరించకపోవడంతో మృత్యువాత పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితుల్లో రహదారుల దయనీయస్థితి కొంత , నిర్లక్ష్యంతో చేజేతులా తెచ్చుకుంటున్న ముప్పు మరికొంత ఉంది. ప్రమాదంలో నివారణలో అధికారులదే పూర్తి బాధ్యత కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాల్సిందే. నవమాసాలు మోసి , అపురూపంగా పెంచుకున్న బిడ్డను అంతే బాధ్యతతో చూసుకోవాలి. దారి తప్పితే వారించాలి. ప్రస్తుతం ప్రతి ఇంటికి ద్విచక్రవాహనం సర్వసాధారణమైంది . తగిన వయసు, కనీసం అనుభవం లేకపోవడం, ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడంతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. వాహనం ఇచ్చినప్పుడే తల్లిదండ్రులు ఇవేమీ పరిశీలించకపోయినా.. కనీసం హెల్మెట్ వాడుకునేలా నేర్పించకపోవడం తెలిసి తెలిసి మృత్యువువైపు నడిపిస్తోంది.

2019 లో 1499 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1422 క్షతగాత్రులు కాగా 355 మంది మరణించారు. రోజులో ప్రమాదాలు జరిగే సమయాలను పరిశీలిస్తే... మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కువగా జరుగుతున్నాయి. మొత్తం 1499 ప్రమాదాల్లో 35.8 శాతం ప్రమాదాలు ఆ సయమంలోనే జరుగుతున్నాయి .

అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు గంటల వరకు అత్యల్పంగా 4.3 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రమాదాలు జరుగుతున్న సమయాలను పరిశీలిస్తే రాత్రి 12గంటల నుంచి తెల్లవారు జాము 3గంటల వరకూ 102 ప్రమాదాలు జరగగా మూడు గంటల నుంచి 6 గంటల వరకూ 91, 6 నుంచి 9 వరకూ 144 చోటుచేసుకున్నాయి.

ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకూ 226, 12 నుంచి మధ్యాహ్నం 3 వరకూ 225, 3నుంచి సాయంత్రం 6 వరకూ 256 ప్రమాదాలు జరుగుతున్నాయి.

సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ 281 ప్రమాదాలు జరుగుతుండగా రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ 174 జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే వంశీ అనుచరులు, వైకాపా నేతల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.