ETV Bharat / state

VATA FOUNDATION: ఆయువు తీరిన చెట్టుకు.. మళ్లీ ప్రాణం పోశారు..!

author img

By

Published : Sep 5, 2021, 9:03 AM IST

అర్ధ శతాబ్ద కాలంగా ఎందరికో నీడనిచ్చిన ఆ వట వృక్షం కూలింది. ఏళ్లుగా ఆ చెట్టుతో... అనుబంధం పెంచుకున్నవారు ఏం చేసైనా దాన్ని కాపాడుకోవాలని సంకల్పించారు. హైదరాబాద్‌కు చెందిన.. 'వట ఫౌండేషన్‌' సభ్యులు వారికి సహకరించి ఆ చెట్టును పునఃప్రతిష్టించారు.

vata-foundation-members-save-an-old-tree-at-machilipatnam
ఆయువు తీరిన చెట్టుకు.. మళ్లీ ప్రాణం పోశారు..!

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం.. అనేక చారిత్రక ఆనవాళ్లకు నెలవు. స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన కట్టడాలతో పాటు అనేక వట వృక్షాలూ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. నగరంలోని జీవిత బీమా సంస్థ డివిజనల్‌ కార్యాలయం చెంతనే ఉన్న వృక్షం ఈ కోవలోకే వస్తుంది. చల్లపల్లి జమీందారుల పాలన కాలం నుంచి ఇది మహావృక్షంగా ఎదిగింది. అప్పట్లో బాటసారులు, విద్యార్థులు, నగరవాసులు.. ఈ చెట్టు కింద సేదతీరేవారు. 70వ దశకంలో ఈ ప్రాంతంలో.. జీవిత బీమా సంస్థ కార్యాలయం నిర్మించారు. అప్పటి నుంచి అక్కడికి వచ్చేవారందరికీ ఈ వృక్షం నీడను పంచింది.

వందలాది మందికి నీడినిచ్చింది.. జీవితాన్ని కూడా..

సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల తరచూ వచ్చే ప్రకృతి వైపరీత్యాలకు క్రమంగా శిథిలమవుతూనే తన మానులోనే.. మరో మొక్కకు ప్రాణం పోసిందీ వృక్షం. దాదాపు అర్ధ శతాబ్దం నుంచి ఆ మహా వృక్షం ఉనికిని కోల్పోయినా.. దాని గర్భం నుంచి ఎదిగిన చెట్టు నీడనిచ్చింది. చిరువ్యాపారులు ఈ చెట్టు కిందే కూర్చొని అమ్మకాలు జరుపుతుంటారు. బీమా సంస్థ ఉద్యోగుల చర్చలు, నిరసనలకు ఈ చెట్టే ఓ వేదిక. అలాంటి వృక్షం కాండం పాడై గత నెల 21న ఒక్కసారిగా కూలింది. దాన్ని ఎలాగైనా సంరక్షించుకోవాలని కొందరు సంకల్పించారు. స్వచ్ఛంద సంస్థలూ ముందుకు రావడంతో అందరూ కలిసి హైదరాబాద్‌కు చెందిన వట ఫౌండేషన్‌ను ఆశ్రయించారు.

విజయవంతంగా చెట్టు పునఃప్రతిష్ట..

చెట్ల కూల్చివేతను వ్యతిరేకించే వట ఫౌండేషన్‌ సభ్యులు.. చెట్లు నరికివేయడం అనివార్యమైతే, సొంత ఖర్చులతో ఆ చెట్లను మరో చోట నాటి సంరక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో తొలిసారి ఓ చెట్టును విజయవంతంగా పునఃప్రతిష్టించారు. తమ కలను వట ఫౌండేషన్‌ సభ్యులు సాకారం చేయడం పట్ల మచిలీపట్నం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: jobs: ప్రతిభకు తగ్గ ప్యాకేజీ!..డిజిటలీకరణతో ఐటీలో పెరిగిన ఉద్యోగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.