ETV Bharat / state

5PM AP TOP NEWS ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 19, 2022, 5:01 PM IST

ap topnews 5 pm
top news

.

  • కృష్ణా జిల్లాలో విషాదం, ఎడ్లబండి కడుగుతూ నదిలో గల్లంతైన ఇద్దరు యువకులు
    కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెంలో విషాదం నెలకొంది. కృష్ణానదిలో ఎడ్లబండి కడిగేందుకు దిగి నలుగురు యువకుల గల్లంతయ్యారు. వెంటనే స్పందించి స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మళ్లీ అధికారంలోకి రాలేనని జగన్​ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారన్న యనమల
    ఏపీలో అప్పుల బరితెగింపుపై కేంద్రం ఇంకెన్నాళ్లు హెచ్చరిస్తుందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల అమలు కన్నా ఓ పత్రికలో ప్రకటనలకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రాలేనని జగన్ ఏపీని కోలుకోలేని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయమన్న సీజేఐ
    తిరుపతిలో సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ పర్యటించారు. దివంగత గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఎన్జీరంగా, వినోబా భావే వంటి వారి ఆశయాలకు అనుగుణంగా మునిరత్నం పని చేశారని అన్నారు. అనంతరం తిరుచానూరులో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి రచించిన సత్యశోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీసీ ఇవ్వలేదని కళాశాలలోనే పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
    ప్రిన్సిపల్​ టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకున్న ప్రిన్సిపల్​తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీన్​ రివర్స్, రాహుల్ గాంధీ​ పీఏ అరెస్ట్, వారిని ఇరికిద్దామనుకుంటే
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యక్తిగత సహాయకుడు సహా ఆ పార్టీకి చెందిన మరో ముగ్గుర్ని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వయనాడ్​లోని రాహుల్ ఆఫీస్​లోని మహాత్మ గాంధీ చిత్రపటం ధ్వంసం కేసులో ఈమేరకు చర్యలు చేపట్టారు. ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తలే ఈ పని చేశారని నమ్మించేందుకు వారంతా యత్నించారని పోలీసులు తేల్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూ.20కోట్ల గోల్డ్ దోపిడీకి స్కెచ్, అడ్డంగా దొరికి సస్పెండ్ అయిన పోలీస్
    ఓ ఆభరణాల రుణ సంస్థ ఆఫీసులోకి చొరబడిన దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.20 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ దోపిడీ వెనుక స్థానిక ఇన్​స్పెక్టర్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆరోగ్య బీమా పాలసీలు ఒకటికి మించి ఉంటే క్లెయిం చేసుకోవడం ఎలా
    రోజురోజుకూ పెరుగుతున్న అనారోగ్య సమస్యల దృష్ట్యా వైద్యం కోసం చేసే ఖర్చు అధికమవుతుంది. వీటి కోసం మనం ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుంటాం. ఖర్చు అధికంగా ఉన్నప్పుడు కొందరు అదనపు రక్షణ బీమా తీసుకుంటారు. దాన్ని ఎలా క్లెయిం చేసుకోవాలో తెలియక చాలా మంది సతమతం అవుతుంటారు. ఈ రెండవ బీమాను ఎలా క్లెయిం చేసుకోవాలో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​తో శాంతి అంటూనే కశ్మీర్​పై పాక్ ప్రధాని మెలిక
    Shahbaz Sharif on India: భారత్​పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​తో తాము శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు షెహబాజ్​ తెలిపారు. అయితే.. జమ్ముకశ్మీర్​ విషయంలో మాత్రం పాత పాడే పాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గంగూలీని టార్గెట్​ చేశానన్న షోయబ్​, అసలేం జరిగింది​
    భారత మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​, పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​ తమ క్రికెట్​ కెరీర్​లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తాజాగా ఓ క్రీడా ఛానల్ 'ఫ్రెనిమీస్​' పేరుతో క్రికెట్​ దిగ్గజాలతో చేసిన ఇంటర్వ్యూలో హోస్ట్​గా వ్యవహరించిన షోయబ్​, తన తోటి క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్​తో ముచ్చటించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దయచేసి అలా చేయొద్దంటున్న యాంకర్ అనసూయ
    Anchor Anasuya requests to fans యాంకర్​, నటి అనసూయ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని కోరారు. అసలేం జరిగందంటే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.