ETV Bharat / state

కౌలురైతు కుటుంబానికి రూ. 2.50లక్షల చెక్కు అందజేత

author img

By

Published : Mar 4, 2021, 2:56 PM IST

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణా జిల్లా పెనమలూరు కౌలురైతు కుటుంబానికి తెదేపా ఎన్నారై విభాగం ఆర్ధిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రూ. 2.50లక్షల చెక్కు​ను ఎన్టీఆర్ భవన్​లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీదుగా అందజేశారు.

The tdp nri section provided financial assistance to the Krishna District Penamaluru tenant farmer family
కౌలురైతు కుటుంబానికి రూ. 2.50లక్షల చెక్​ అందజేత

కృష్ణా జిల్లా పెనమలూరులో ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయి మోర్ల నాగభూషణం అనే కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై స్పందించిన తెదేపా ఎన్నారై విభాగం ఆయన కుటుంబానికి ఆర్ధిక సాయం అందించింది. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో రూ. 2.50లక్షల చెక్​ను.. నాగభూషణం కుమారుడికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందచేశారు.

ఇదీ చదవండి: 'చంద్రబాబు హయాంలో పక్క రాష్ట్రాలకు వలస పోయారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.