ETV Bharat / state

రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటుతో... పోలీసు యూనిట్ల హద్దుల్లో మార్పు

author img

By

Published : Apr 12, 2022, 5:39 AM IST

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పోలీసు యూనిట్ల హద్దులు కూడా మారాయి. కొన్ని కృష్ణా పోలీసు నుంచి విజయవాడ కమిషనరేట్‌లో చేరగా మరికొన్ని అక్కడి నుంచి కృష్ణా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పటివరకు ఇవన్నీ మౌఖిక ఆదేశాల ప్రకారం సాగాయి. వీటికి తాజాగా....ప్రభుత్వం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది.

Police
Police

జిల్లాల ఏర్పాటుతో పోలీసు యూనిట్ల హద్దుల్ని నిర్ణయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యథావిధిగా కృష్ణా పోలీసు విభాగం మచిలీపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. పునర్విభజన అనంతరం.. ఈ పోలీసు యూనిట్‌లో దిశ స్టేషనుతో సహా 39 పీఎస్​లు మిగిలాయి. పార్లమెంటు నియోజకవర్గ హద్దుల ప్రకారం కాకుండా నగరానికి ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం తమ పరిధిలోనే ఉంచాలంటూ...నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా చివరివరకు యత్నించినా.. ఈ వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..కమిషనరేట్‌ నుంచి కృష్ణాలోకి 10 స్టేషన్లు విలీనమయ్యాయి. పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఆత్కూరు, గన్నవరం, ఉంగుటూరు, ఉయ్యూరు పట్టణ, కంకిపాడు, ఉయ్యూరు గ్రామీణ, పెనమలూరు, గన్నవరం ట్రాఫిక్‌ స్టేషన్లు కష్ణా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆధ్వర్యంలోకి వచ్చాయి. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీఐపీల భద్రత దృష్ట్యా....గన్నవరంలోనే డీఎస్పీ కార్యాలయం ఉంచారు. గతంలో తూర్పు ఏసీపీగా ఉన్న విజయపాల్‌... విలీనం తర్వాత గన్నవరం డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాల ఏర్పాటుతో... పోలీసు యూనిట్ల హద్దుల మార్పు
ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌: ఇప్పటివరకు విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌గా ఉన్న పేరును ప్రభుత్వం మార్చింది. జిల్లా పేరు ప్రతిబింబించేలా ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్‌గా నామకరణం చేసి..... విజయవాడ కేంద్రంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఈ యూనిట్‌లో మొత్తం 36 స్టేషన్లు మిగిలాయి. కృష్ణా నుంచి నందిగామ, వీరులపాడు, కంచికచర్ల, చందర్లపాడు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, చిల్లకల్లు, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట పోలీసు స్టేషన్లు.....కమిషనరేట్‌లో విలీనం అయ్యాయి. ఫలితంగా....గతంలో కన్నా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు బాగా పెరిగాయి.

నందిగామ కేంద్రంగా ఉన్న సబ్‌డివిజన్‌....కమిషనరేట్‌లో విలీనం అయినా యథాతధంగా ఉంది. నందిగామలో ఉన్న పాత డీఎస్పీ...విలీనం తర్వాత అక్కడే ఏసీపీగా నాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. ఇక మిగిలిన తిరువూరు, మైలవరం నియోజకవర్గ ప్రాంతాల్లోని స్టేషన్ల పర్యవేక్షణకు మైలవరం కేంద్రంగా డివిజన్‌ను....ఇటీవల కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి: కేబినెట్​లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.