ETV Bharat / state

'విజయసాయి రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి'

author img

By

Published : Sep 18, 2020, 8:32 AM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు బుద్దా వెంకన్న, నక్కా ఆనంద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

TDP leaders buddha venkanna, nakka anand babu fire on YCP MP vijayasaireddy
తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

ఏడాదిలోగా ఆర్థిక, అవినీతి కేసుల విచారణ పూర్తి చెయ్యాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంతో... వైకాపా నేత విజయసాయిరెడ్డి వెన్నులో వణుకు మొదలయ్యిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అందుకే న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా గొంతు నొక్కుతూ జీఓ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్... కోర్టులు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్​ను తప్పుబట్టడం న్యాయస్థానాలను కించపర్చడమేనని అన్నారు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని... తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. న్యాయస్థానాలపై నిందలు వేస్తున్న విజయసాయిరెడ్డి... రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఆ ప్రతిమలు ఎవరు ఎత్తుకెళ్లినట్టు? దర్యాప్తు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.