టీడీపీ దళిత మహిళ నేతల అరెస్ట్.. జగన్, కొడాలి నానిలను అగౌరపరిచారంటూ...!

author img

By

Published : Nov 19, 2022, 8:26 PM IST

టీడీపీ దళిత మహిళ  నేతల అరెస్ట్

TDP Dalit women leaders arrested: ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే కొడాలి నానిలను అగౌరపరిచారంటూ కృష్ణాజిల్లా గుడివాడలో అరెస్టు అయిన టీడీపీ దళిత మహిళ నేతలను పోలీసులు విడుదల చేశారు. దళితులకు చెందిన 27 రకాల స్కిములను తొలగించడంతోనే కడుపు మండి గాడిదకు సీఎం ఫోటో పెట్టి తమ ఆవేదనను తెలియజేశామని మహిళ నేతలు తెలిపారు.

TDP Dalit women leaders arrested in AP: ముఖ్యమంత్రి జగన్​ను అగౌరవపరిచిన కేసులో కృష్ణాజిల్లా గుడివాడలో అరెస్టు అయిన టీడీపీ దళిత మహిళ నేతలను పోలీసులు విడుదల చేశారు. తెలుగు మహిళా నేతలకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దళితులకు చెందిన 27 రకాల స్కిములను తొలగించడంతోనే కడుపు మండి గాడిదకు సీఎం ఫోటో పెట్టి తమ ఆవేదనను తెలియజేశామని మహిళ నేతలు తెలిపారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం మహిళలని కూడా చూడకుండా అరెస్టులు చేయించే స్థితికి దిగజారిందని.. టీడీపీ దళిత నాయకురాలు అసిలేటి నిర్మల మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే: ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే కొడాలి నానిలను అగౌరపరిచారంటూ కృష్ణాజిల్లా గుడివాడలో అరెస్టు అయిన టీడీపీ దళిత మహిళ నేతలకు సంఘీభావంగా, గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్​కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తో పాటు, అరెస్టు అయిన తెలుగు మహిళలకు మద్దతుగా నియోజకవర్గంలోని పెద్ద సంఖ్యలో శ్రేణులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తెలుగు మహిళలను విడుదల చేసే వరకు స్టేషన్ నుండి బయటకు వెళ్లేది లేదని పార్టీ శ్రేణులు భీష్ముంచుకున్నారు.

కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ దళిత నేతల అరెస్ట్ లపై గుడివాడ వన్ టౌన్ సీఐ గోవిందరాజులు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నానిలను అగౌరవ పరిచారంటూ మాజీ కౌన్సిలర్ రేమల్లి ప్రభోదరాణి ఫిర్యాదు మేరకు తాము విచారణ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ ,ఎమ్మెల్యే కొడాలి నాని ఫోటోలను గాడిదకు ముందు వెనుక పేట్టి సోషల్ మీడియా ప్రచారం చేసినట్లు విచారణలో గుర్తించినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో గుర్తించిన టీడీపీ నేతలు అసిలెటి నిర్మల, సిరిపురపు తులసిరాణి, మాదాల సునీత, బంటు రోజాలపై 505 క్లాజ్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ గోవిందరాజులు మీడియాకు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.