ETV Bharat / state

ఠాగూర్ సినిమా సీన్​ను నిజం చేద్దామనుకున్నారు.. కథ అడ్డం తిరిగింది

author img

By

Published : Sep 8, 2022, 1:01 PM IST

Updated : Sep 8, 2022, 1:41 PM IST

Tagore Scene repeats : ఠాగూర్ సినిమా గుర్తుందా మీకు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు వైద్యులు నటిస్తుంటారు. వెంటనే డబ్బు కట్టేస్తే క్లిష్టమైన ఒక ఆపరేషన్ చేసి పేషెంట్‌ని కాపాడతామని కలరింగ్ ఇస్తుంటారు. చివరకు మేం ఎంతో ట్రై చేశాం కానీ, మీ అన్నయ్యని కాపాడలేకపోయామని.. చిరంజీవి వద్దకు వచ్చి దీనంగా ఫేస్ పెట్టుకుని చెబుతుంటారు. అలాంటి సీన్ నే రక్తి కట్టించారు.. తెలంగాణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, కానీ కథ అడ్డం తిరిగింది.

tagore
tagore

Tagore Scene repeats : ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చేసిన శస్త్రచికిత్స వికటించి గర్భిణి మృతిచెందగా.. ఆమె పరిస్థితి విషమించిందంటూ మెరుగైన వైద్యం అందించాలని మృతదేహాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యుల్ని నమ్మించారు. ఈ ఘటన ఆమనగల్లు పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

ఆదివారం సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ విషయం చెప్పకుండా మెరుగైన చికిత్స అందించాలని అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యం అందుతోందని.. కోలుకుంటోందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత తమ ప్రయత్నం ఫలించలేదని మృతి చెందిందని తెలిపారు. అనుమానం వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబానికి రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందపత్రం కూడా రాసిచ్చారు.

Last Updated : Sep 8, 2022, 1:41 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.