ETV Bharat / state

9 నెలలైనా అందని సాయం.. బాధితుల 'సత్యాగ్రహ దీక్ష'

author img

By

Published : Feb 27, 2023, 5:31 PM IST

Mandali Buddha Prasad satyagraha initiation in Challapally
చల్లపల్లిలో మండలి బుద్ద ప్రసాద్ సత్యాగ్రహ దీక్ష

No Compensation to Road Accident Victims : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన, గాయాలైన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ వారి విషయంలో ప్రభుత్వం మాత్రం బాధ్యత మరచిపోయి చాలా కాలమైంది. పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. 9 నెలలుగా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆదుకోండి అంటూ "సత్యాగ్రహ దీక్ష"కు పూనుకున్నారు బాధిత కుటుంబ సభ్యులు.

No Compensation to Road Accident Victims : ఆనందంతో వారందరూ వివాహానికి బయలుదేరారు. ఒక్కసారిగా పెను ప్రమాదం జరిగింది. ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో ఆటో బోల్తా పడి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఇప్పటి విషయం కాదు. ఈ ఘటన జరిగి 9 నెలలు అయ్యింది. వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది విన్న ప్రతి ఒక్కరి మనసు కలచి వెేసింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలనీ భావించారు. వారి గురించి తెలుసుకుని సపర్యలు చేశారు. సహాయం చేయలేకపోయినా కనీసం వారిలో బాధ కనపడుతుంది. సహాయం చేయగలిగే భాద్యత ఉన్నా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు, ప్రభుత్వం. అధికారులు, రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నో రోజులు వేచి చూసిన బాధిత కుటుంబాలు న్యాయం చేయాలంటూ సోమవారం "సత్యాగ్రహ దీక్ష" సోమవారం చేశారు.

ఎంతమందికి పరిహారం ఇవ్వాలి..? : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుండి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి 2002 మే 26న వివాహానికి ఆటోలో వెళ్తుండగా.. కాసానగర్ వద్ద ఆటో బోల్తాపడి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు. ఘటన జరిగి 9 నెలలు గడిచినా చింతలమడ వైపు కన్నెత్తి చూడలేదని.. మృతులకు బీమా, గాయాల పాలైన వారికి నష్ట పరిహారం కూడా చెల్లించలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్యెల్యే, మంత్రులు, కలెక్టర్ వద్దకు వెళ్లినప్పటికీ న్యాయం జరగలేదని.. అదీకాకుండా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి... ఎంతో మంది మృతి చెందుతుంటారు.. అందరికీ పరిహారం ఇస్తారా అని అధికారులు అంటున్నారని గ్రామస్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవయవాలు కోల్పోయిన బాధితులకు నేటికీ వికలాంగుల పెన్షన్ అందలేదని వాపోయారు.

న్యాయం కోసం : కనీసం ఆరోగ్య శ్రీ కూడా వర్తించక ప్రవేటు ఆస్పత్రిలలో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ "సత్యాగ్రహ దీక్ష" చేపట్టారు. టీడీపీ శ్రేణులు, దళిత సంఘాలు ఈ దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ దీక్ష ప్రారంభించి "సత్యాగ్రహ దీక్ష"లో పాల్గొన్నారు.

9 నెలలైనా అందని సాయం.. బాధితుల 'సత్యాగ్రహ దీక్ష'

"ఈ ప్రమాదం జరిగి 9 నెలలు అవుతుంది. చనిపోయిన వారికి ఎక్స్​గ్రేషియా ఇవ్వలేదు. చనిపోయినవారి భార్యలకు వితంతు పింఛన్లు, వికలాంగులు అయినవారికి వికలాంగులు పింఛన్లు ఇవ్వలేదు. పింఛన్లకు అర్హత లేని విధంగా చేశారు. కక్షపూరితంగా ఈ ఊరి మీద, దళితుల మీద చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. వీళ్లంతా జగన్​ మోహన్ రెడ్డిగారికి ఓట్లు వేసిన వాళ్లే." - మండలి బుద్దప్రసాద్, మాజీ ఉపసభాపతి

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.