Power Charges Increase In State: విద్యుత్‌ వినియోగదారులపై బాంబు..వైసీపీ పాలనలో ప్రజలపై రూ.వేల కోట్ల విద్యుత్‌ భారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 10:49 AM IST

Power Charges Increase In State
Power Charges Increase In State ()

Power Charges Increase In State: విద్యుత్‌ వినియోగదారులపై మరో బాంబు పడబోతోంది. డిస్కంల ప్రతిపాదనలకు ఏపీఈఆర్‌సీ అనుమతిస్తే ట్రూఅప్‌ కింద యూనిట్‌కు రూపాయి 10 పైసల వంతున అదనపు షాక్‌ వినియోగదారులకు తగలనుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రాయితీగా భరిస్తేనే వినియోగదారులకు వెసులుబాటు దక్కుతుంది. ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేర్లతో ఇప్పటికే మూడు భారాలను వినియోగదారులపై ప్రభుత్వం వేసింది.

Power Charges Increase In State: విద్యుత్‌ వినియోగదారులపై బాంబు..వైసీపీ పాలనలో ప్రజలపై రూ.వేల కోట్ల విద్యుత్‌ భారం

Power Charges Increase In State : నెలకు 300 యూనిట్లు వాడే వినియోగదారుడు టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ ఛార్జీల కింద 17వందల 96 రూపాయలు చెల్లించాలి. ఈ భారాలు కలిపితే చెల్లించాల్సిన మొత్తం 2 వేల 456 రూపాయలు అవుతుంది. నెల బిల్లులో 35 శాతం అదనపు భారం వేస్తే సామాన్య ప్రజలు భరించే పరిస్థితి ఉంటుందా? రాష్ట్ర విద్యుత్‌సంస్థలు వినియోగదారులపై 7 వేల 200 కోట్ల భారం వేయడానికి రంగం సిద్ధం చేశాయి.

ఈ మొత్తాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరానికి ట్రూఅప్‌ కింద వసూలు చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి లో ప్రతిపాదనలు దాఖలు చేశాయి. ఈ లెక్కలను పరిశీలించి ట్రూఅప్‌ కింద ఎంత వసూలు చేసుకోవడానికి అనుమతించాలనేదానిపై APERC (Andhra Pradesh Electricity Regulatory Commission) నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రతిపాదనలపై ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి.

Electricity bills రూ. 40, రూ. 20, 19వేలు... ఓ గ్రామంలో పేదల ఇంటి విద్యుత్ బిల్లులు..!
FPPCA Charges in Andhra Pradesh : డిస్కంల ప్రతిపాదనలను యథాతథంగా ఆమోదిస్తే విద్యుత్‌ వినియోగదారులపై యూనిట్‌కు రూపాయి 10 పైసల వంతున భారం పడుతుంది. రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్‌ వినియోగదారులు కలిపి ఏడాదికి సుమారు 66 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన డిస్కంల ప్రతిపాదనల్లో చూపిన 7 వేల 200 కోట్లు సర్దుబాటు కావడానికి 12 నెలల పాటు భరించాలి. ఇప్పటికే 2014-19, 2021-22 ట్రూఅప్‌ మొత్తాలతో పాటు ప్రతినెలా విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును FPPCA (Fuel and Power Purchase Cost Adjustment ) పేర్లతో డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఈ కారణంగా ఒకే బిల్లులో మూడు అదనపు భారాలు పడుతున్నాయి. 2022-23 ట్రూఅప్‌ వసూలుకు అనుమతిస్తే ఒకే బిల్లులో నాలుగో భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది.

Electricity Charges Increase Every Year in AP : గత వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ ఊహించినదాని కంటే భారీగా పెరిగిందన్న డిస్కంలు ... రికార్డు స్థాయిలో గరిష్ఠ వినియోగం 264 మిలియన్‌ యూనిట్లకు చేరిందని చెబుతున్నాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చే విద్యుత్‌ పోను ముందస్తుగా స్వల్పకాలిక ఒప్పందాల ఆధారంగా తీసుకునే విద్యుత్‌ కూడా సరిపోలేదని అంటున్నాయి. దేశీయ బొగ్గుకు కొరత ఉందని, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో (Thermal Power Station) వినియోగించే బొగ్గులో కనీసం 10శాతం విదేశీ బొగ్గు సమకూర్చుకోవాలని కేంద్రం ఆదేశించిందని...అందుకే 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గును కొన్నట్లు డిస్కంలు తెలిపాయి. ఈ కారణాలతోనే అదనపు భారం తప్పట్లేదని డిస్కంలు అంటున్నాయి.

Electricity Charges Huge Increase in YSRCP Government: మాట తప్పి.. మడమ తిప్పేసిన జగన్.. విద్యుత్‌ ఛార్జీలను ఎడాపెడా పెంచి ప్రజలకే షాకిచ్చిన వైసీపీ ప్రభుత్వం
Thousands of Crores of Electricity Burden on People Under YCP Regime : 2014-19 మధ్య ట్రూఅప్‌ కింద 2 వేల910.74 కోట్ల మొత్తాన్ని 36 నెలల్లో వసూలు చేసుకోడానికి ఏపీఈఆర్‌సీ డిస్కంలకు (APERC DISCOM)అనుమతించింది. ఈ మొత్తాన్ని 2022 ఆగస్టు బిల్లు నుంచి వసూలు చేస్తున్నాయి. ఏడాదికి 969.70 కోట్ల వంతున అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ట్రూఅప్‌ భారం 3వేల82.99 కోట్లు కాగా.. 2023 ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఎఫ్‌పీపీసీఏ పేరుతో యూనిట్‌కు గరిష్ఠంగా 40 పైసల వంతున ప్రతినెలా డిస్కంలు వసూలు చేస్తున్నాయి. గత 6 నెలల్లో సుమారు 1500 కోట్లు వసూలు చేశాయి.

Electricity Charges Huge Increase in YSRCP Government: నాలుగేళ్లుగా విద్యుత్ బిల్లులపై జగన్ వీర బాదుడు.. షాక్‌ కొట్టేలా కరెంటు బిల్లులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.