ETV Bharat / state

నగరంలో 15 శాశ్వత టీకా కేంద్రాలు

author img

By

Published : May 11, 2021, 3:55 PM IST

విజయవాడ నగరంలో 15 ప్రాంతాల్లో శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ వెల్లడించారు. క్రమపద్ధతిలో టీకా వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అధికారులతో చర్చిస్తున్న కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, సీఎంవో గీతాబాయి
అధికారులతో చర్చిస్తున్న కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, సీఎంవో గీతాబాయి

విజయవాడ నగరపాలక సంస్థ.. నగరంలోని 15 ప్రాంతాల్లో శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ వెల్లడించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత ప్రాంతాలను ఆయన ప్రజారోగ్య విభాగం అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా, క్రమపద్ధతిలో టీకా వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఎప్పుడు రావాలో తెలియజేసేలా చీటీలను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇళ్లకు వెళ్లి అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఏర్పాటు చేసే ప్రాంతాలు..

  • కొత్తపేట కేబీఎన్‌ కళాశాల
  • భవానీపురం షాదీఖానా
  • ఇస్లాంపేట దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్‌ పాఠశాల
  • పూర్ణానందంపేట కౌతా సుబ్బారావు మున్సిపల్‌ పాఠశాల
  • భవానీపురం పాత హౌసింగ్‌ బోర్డుకాలనీలోని ఎంఎల్‌సి ఎంసి ఎలిమెంటరీ పాఠశాల
  • రాజీవ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
  • సత్యనారాయణపురం ఏకెటిపిఎం మున్సిపల్‌ పాఠశాల
  • సింగ్‌నగర్‌ ఎంకె.బేగ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాల
  • మధురానగర్‌ సద్గతి విద్యానికేతన్‌ పాఠశాల
  • అరండల్‌పేట అబ్దుల్‌కలాం మున్సిపల్‌ ఉర్థు పాఠశాల
  • పటమట జిడిఇటి మున్సిపల్‌ పాఠశాల
  • కృష్ణలంక ఏపిఎస్‌ఆర్‌ఎంసి ఉన్నత పాఠశాల
  • రాణిగారితోట శాంపిల్‌ బిల్డింగ్‌
  • గుణదల బిషప్‌ గ్రాసీ పాఠశాల
  • శ్రీనివాసనగర్‌ బ్యాంకుకాలనీలోని పరిటాల ఓంకార్‌ వీఎంసీ కమ్యూనిటీ హాలు

ఇవీ చూడండి:

కరోనాతో జస్టిస్ జాస్తి సత్యనారాయణ మూర్తి మృతి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.