ETV Bharat / state

ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లలో చేరుకుంటున్న ప్రయాణికులు

author img

By

Published : May 28, 2020, 2:27 PM IST

ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వారిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులందరికీ థర్మల్‌ స్కానింగ్‌, మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరి చేసింది. సామాజిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి మా ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు.

ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లలో చేరుకుంటున్న ప్రయాణికులు
ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లలో చేరుకుంటున్న ప్రయాణికులు

ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లలో చేరుకుంటున్న ప్రయాణికులు

లాక్ డౌన్ తో 50 రోజులుగా వెలవెల బోయిన విజయవాడ రైల్వే స్టేషన్ లో ఎట్టకేలకు ప్రయాణికుల సందడి ప్రారంభమైంది. దిల్లీ నుంచి ప్రత్యేక రైలు రాకతో స్టేషన్ నుంచి ప్రయాణికుల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి చేరుకోగా.. ఇక్కడ చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వారు వారిని స్వస్థలాలకు బయలు దేరి వెళ్లారు. ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. రాష్ట్రానికి వచ్చిన వారందరికీ కరోనా ప్రాధమిక పరీక్షలు జరిపి క్వారంటైన్​కు తరలించారు.

ప్రారంభమైన రైళ్ల రాకపోకలు

మార్చి 23న జనతా బంద్ ఆ తర్వాత కొనసాగిన లాక్ డౌన్​తో బోసి పోయిన విజయవాడ రైల్వే స్టేషన్ లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుని కష్టాలు పడుతోన్న వారిని సొంత ప్రాంతాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. నిన్న బయలుదేరిన దిల్లీ నిజాముద్దీన్ -చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైలు ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ చేరుకుంది. దిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిక్కుకున్న 318మంది ప్రయాణికులు రాజధాని ప్రాంతం విజయవాడకు చేరుకున్నారు.

ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగపూర్, వరంగల్ స్టేషన్లలో స్టాపింగ్

ఆయా రాష్ట్రాల్లోని ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగపూర్, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలుకు స్టాపులు ఏర్పాటు చేయడం సహా ఐఆర్​టీసీ ద్వారా రిజర్వేషన్ సదుపాయం కల్పించడంతో వారంతా స్వస్థలాలకు బయలు దేరి వచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులకు కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీ లత సహా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. వారందరి కోసం ప్రత్యేకంగా నిరీక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజనాన్ని అందించారు.

పరీక్షల తర్వాత ప్రయాణానికి అనుమతి

ప్రయాణికులను జిల్లాల వారీగా వేరు చేసివారి ఆధార్ కార్డు నెంబర్ సహా పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్కానింగ్ యంత్రం ద్వారా కరోనా ప్రాథమిక పరీక్షలు చేశారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు లేవని నిర్థారించుకున్న అనంతరం వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమంతించారు. వీరందరికీ జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి అక్కడ కరోనా నిర్దారణ కోసం పరీక్షలు చేయనున్నారు. 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన తర్వాత సొంతింటికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

ప్రత్యేక రైళ్ల ఏర్పాటుతో ప్రయాణికుల్లో ఆనందం

లాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న తమకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రైలు ఏర్పాటు సహా సదుపాయాలు కల్పించడం పై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్​తో ఇతర రాష్ట్రాల్లో కష్టాలు పడ్డామని తిరిగి సొంతూళ్లకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.

విజయవాడ మీదుగానే ప్రత్యేక రైళ్లు రాకపోకలు

ఇకపై పలు ప్రాంతాల నుంచి బయలుదేరే ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు జరిపే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం స్టేషన్ ప్రాంగణంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు సహా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి

వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.