ETV Bharat / state

గుడిలో చిల్లరతో గుడిసె వేసుకున్నా... ఆధార్‌ ఆకలి బాధ తీర్చలేదు

author img

By

Published : Dec 26, 2019, 1:03 PM IST

Updated : Dec 26, 2019, 6:35 PM IST

భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, ఆస్తి లేదని బంధువులు దరిచేరనివ్వలేదు. దిక్కుతోచనిస్థితిలో కరకట్టపై పరదా వేసుకుని జీవనం సాగిస్తుంది ఆ బామ్మ. ఆధార్ కార్డు ఉన్నా... రేషన్ కార్డు రాలేదు. కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. గత ఆరేళ్లుగా బిక్కు బిక్కుమంటూ బతుకీడుస్తోంది బామ్మ. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదని బోరుమంటోంది.

old-women-problems
old-women-problems

గుడిలో చిల్లరతో గుడిసె వేసుకున్నా... ఆధార్‌ ఆకలి బాధ తీర్చలేదు...

ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా... ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ విలవిలలాడుతుంది బామ్మ. పేరు తమ్ము అలివేలమ్మ. ఆరేళ్లుగా కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం.. నడకుదురు గ్రామం ప్రక్కన మోపిదేవి నుంచి విజయవాడ వెళ్ళే కృష్ణా నది ఎడమ కరకట్టపై చిన్న పరదాతో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తుంది. భర్త చనిపోయాడు. పిల్లలు లేరు. ఆస్తి లేక బంధువులు పట్టించుకోలేదు.

విజయవాడ... గోసాల గ్రామం నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ నడకుదురు ఆలయానికి చేరుకుంది. ఆలయం పరిసర ప్రాంతాన్ని శుభ్రపరుస్తుంది. ఆలయానికి వచ్చిన వారు తమకు తోచిన సాయం చేస్తూ ఉండేవారు. అలా వెయ్యి రూపాయలు కూడబెట్టుకుంది. ఆ సొమ్ముతో చిన్న పరదా వేసుకొని అందులోనే జీవనం సాగిస్తోంది.

తమ్ము అలివేలమ్మకు ఆధార్ కార్డు ఉంది. గత 3 ఏళ్లుగా.. రేషన్ కార్డు కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా రాలేదు. వితంతు పింఛనూ అందలేదు. తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులు ఉంటుంది. జ్వరం వస్తే పలరించే వారు ఉండరు. మంచినీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లి తెచ్చుకుంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోమని కొందరు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అధికారులు స్పందించి రేషన్ కార్డు, పింఛన్, ఇంటి స్థలం ఇప్పించాలని వేడుకుంటుంది. దాతలు ముందుకొస్తే... చిన్న గుడిసె వేసుకుంటానని చెబుతోంది. రాత్రి పూట మద్యం తాగి కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెబుతోంది బామ్మ. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నానని అంటోంది.

ఇవీ చదవండి:

ఆకాశంలో అద్భుతం.. ఉంగరంలా మెరిసిన సూర్యుడు

Intro:AP_VJA_02_25_KARAKATTAA_DIKKU_6YEARS_PKG_byte_AP10044

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511
   
యాంకర్ వాయిస్....
 ఒకటి కాదు,  రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాలు  ఎండైనా , వానైనా అమెకు కరకట్ట మీదే నివాసం,
  చిన్న పరజా పందిరే దిక్కు,   నిత్యం వేలాది మంది ప్రజలు కరకట్టపై ప్రయాణిస్తున్నా  ఒక్కరూ కన్నెత్తి చూడటం లేదు, ఈమె భర్త  పది  సంవత్సరాల క్రితం చనిపోయాడు పిల్లలు లేరు ఆస్తి లేకపోవడంతో బందువులు పట్టించుకోవడం మానేసారు, బ్రతుకుదెరువు కోసం నడకుదురు దేవాలయానికి వచ్చి కరకట్ట పైనే ఆరు సంవత్సరాలుగా అనేక కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న  బామ్మా అలివేలమ్మ  పై ప్రత్యేక కధనం.....

వాయిస్ ఓవర్ .....
 ఎవ్వరు లేని వారికి దేముడే దిక్కు అన్నట్లుగా  ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ విలవిలలాడుతుంది నిత్యం పాములు, మండ్రగబ్బాలు, ఇతర విష జంతువులతో ప్రాణభయం,  ఒక ముసలి బామ్మా ఒకటి కాదు రెండు కాదు   గత ఆరు  సంవత్సరాలుగా   కృష్ణాజిల్లా,  చల్లపల్లి మండలం, నడకుదురు  గ్రామం ప్రక్కన  మోపిదేవి  నుండి విజయవాడ వెళ్ళే  కృష్ణా నది ఎడమ కరకట్ట పై   చిన్న పరజా తో  గుడిసె వేసుకుని జీవనం సాగిస్తుంది.   భర్త చనిపోవడం, సంతానం లేకపోవడం, సొంత ఆస్తి లేకపోవడంతో  బందువులు ఎవ్వరూ చేరదీయక పోవడంతో విజయవాడ దగ్గర గోసాల గ్రామం నుండి అన్ని   గ్రామాలు తిరుగుతూ నడకుదురు ఆలయంకు చేరుకుంది. ఆలయం పరిసర ప్రాంతాలలో  చెట్లు ఆకులు తుడవటం తో ఆలయానికి వచ్చిన వారు తమకు తోచిన సాయం చేస్తూ ఉండేవారు.  అలా సంపాదించుకున్న నగదు సుమారు వెయ్యి రూపాయలు కుడబెట్టుకుంది  వాటిని కుడా ఆమె పరజా పాకలో లేనప్పుడు కట్టపై వెళ్లే దొంగలు ఎత్తుకుపోయేవారని విలపిస్తుంది తమ్ము అలివేలమ్మ. 

ఆధార్ కార్డు ఉన్నప్పటికీ  గత మూడు సంవత్సరాలుగా రేషన్ కార్డు కు అప్ప్లై చేసినప్పటికీ మంజూరు కాలేదని  వితంతు పెంక్షన్ కుడా ఇవ్వడం లేదని తినడానికి తిండి లేక ఒక్కోసారి రోజుల తరబడి పస్తులు ఉంటూ నిరసించి పోతుంది అలివేలమ్మ. జ్వరము వస్తే పలరించే వారే ఉండరు రోజుల తరబడి మంచం మీదే ఉండాలి.   సుమారు ముప్పై అడుగుల ఎత్తైన కరకట్ట ఎక్కలేక దిగలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది.  త్రాగునీటి కోసం  కిలోమీటరు దూరం వెళ్లి త్రాగునీరు తెచ్చుకోవాలి. కట్టే పుల్లలతో వంట చేసుకొంటుంది.   కరకట్ట పై చిన్నకర్రలతో  పరజాకప్పుకుని  జీవనం సాగిస్తున్నా కొందరు అక్కడ నుండి వెళ్ళిపోమని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపింది.  కరకట్టపై వేగంగా వెళ్లే ఏ వాహం ఏ సమయంల్ తనపై ఎక్కి వెల్లిపోతాయి అని భయాందోళన వ్యక్తం చేస్తుంది.
 చల్లపల్లి  మండల  ప్రభుత్వ అధికారులు  ఇప్పటి కైనా స్పందించి  రేషన్ కార్డు,   పెంక్షన్, ఇంటి స్థలం కుడా  ఇప్పించాలని  వేడుకొంటుంది.  దయగల దాతలు చిన్న గుడిసె వేసుకోటానికి  ఆర్ధిక సహాయం చేయాలనీ కోరుతుంది.  రాత్రి సమయంలో  కరకట్ట పై ప్రయాణించే వారు మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని  ఎప్పుడు ఏమి జరుగుతుందో నని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తూన్నానని  అలివేలమ్మ  తెలిపింది. 
 
 వాయిస్ బైట్స్ తమ్ము అలివేలమ్మ

  నడకుదురు గ్రామస్తుడు  - పోనమాల శివ నాగేశ్వర రావు 

వీడియో ఫైల్ FTP ద్వారా పంపడమైనది.


    
  


Body:ఒకటి కాదు,  రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాలు  ఎండైనా , వానైనా అమెకు కరకట్ట మీదే నివాసం,
  చిన్న పరజా పందిరే దిక్కు,   నిత్యం వేలాది మంది ప్రజలు కరకట్టపై ప్రయాణిస్తున్నా  ఒక్కరూ కన్నెత్తి చూడటం లేదు, ఈమె భర్త  పది  సంవత్సరాల క్రితం చనిపోయాడు పిల్లలు లేరు ఆస్తి లేకపోవడంతో బందువులు పట్టించుకోవడం మానేసారు, బ్రతుకుదెరువు కోసం నడకుదురు దేవాలయానికి వచ్చి కరకట్ట పైనే ఆరు సంవత్సరాలుగా అనేక కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న  బామ్మా అలివేలమ్మ  పై ప్రత్యేక కధనం.....



Conclusion:ఒకటి కాదు,  రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాలు  ఎండైనా , వానైనా అమెకు కరకట్ట మీదే నివాసం,
  చిన్న పరజా పందిరే దిక్కు,   నిత్యం వేలాది మంది ప్రజలు కరకట్టపై ప్రయాణిస్తున్నా  ఒక్కరూ కన్నెత్తి చూడటం లేదు, ఈమె భర్త  పది  సంవత్సరాల క్రితం చనిపోయాడు పిల్లలు లేరు ఆస్తి లేకపోవడంతో బందువులు పట్టించుకోవడం మానేసారు, బ్రతుకుదెరువు కోసం నడకుదురు దేవాలయానికి వచ్చి కరకట్ట పైనే ఆరు సంవత్సరాలుగా అనేక కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న  బామ్మా అలివేలమ్మ  పై ప్రత్యేక కధనం.....
Last Updated : Dec 26, 2019, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.