ETV Bharat / state

రైల్వే ట్రాక్​ దగ్గర పసి బాలుడు.. వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు..

author img

By

Published : Apr 27, 2021, 4:16 PM IST

నవ మాసాలు మోసి కనిపెంచిన ఆ తల్లికి.. కడుపుతీపి గుర్తుకు రాలేదేమో.. ముద్దులొలికే ఆ బాలుడిని వదిలి వెళ్లేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకువచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచిపోయిందేమో.. పేగు బంధాన్ని వదిలిపెట్టేసింది. కష్టమే వచ్చిందో.. భారమని అనుకుందే ఆ మాతృమూర్తి చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి బాలుడిని రైల్వే ట్రాక్​ వద్ద వదిలి వెళ్లిపోయింది.

child left near railway track
చిన్నారి బాలుడు

ముద్దులొలికే బాలుడిని ఎలా వదిలేయాలనిపించిందో?

విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర్లో ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో చిన్నపిల్లల ఏడుపు వినిపించడంతో వీరాంజనేయులు అనే వ్యక్తి గుర్తించారు. రైల్వే ట్రాక్ సమీపంలో ఏడాదిలోపు వయసున్న బాలుడిని చూసి రక్షించాడు. చుట్టుపక్కల ఉన్నవారిని బాలుడు గురించి విచారించగా... ఎవరూ తమకు తెలియదని చెప్పటంతో.. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కి సమాచారం ఇచ్చి సిబ్బందికి అప్పగించాడు. తాను పూల మార్కెట్​కు వెళ్తుండగా.. ఏడుపు వినిపించిందనీ.. చుట్టుపక్కల వెతకగా.. రైల్వే ట్రాక్ దగ్గర బాలుడు ఉన్నాడని వీరాంజనేయులు వివరించారు.

ఇదీ చదవండి: కొవిడ్ రోగుల అవస్థలు.. వార్డుల్లోకి స్నానాల గదుల్లోని నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.