ETV Bharat / state

వన జాతరకు వేళాయే.. నేటి నుంచి మినీ మేడారం

author img

By

Published : Feb 1, 2023, 10:26 AM IST

Medaram Mini Jatara in Mulugu: నేటి నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం మినీ జాతరకు సర్వం సిద్ధమైంది. జాతరకు ముందే కొందరు భక్తులు వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుని కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకుంటున్నారు.

వన జాతర
వన జాతర

వన జాతర

Medaram Mini Jatara in Mulugu: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర సందడి మొదలైంది. మండ మెలిగే పండుగగా పిలిచే మినీ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రెండు రోజుల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల దర్శనానికి వస్తున్నారు. తలనీలాలు సమర్పించి, జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తల్లులకు బంగారం కానుకగా సమర్పిస్తున్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు విడుదల: మేడారం మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం మండ మెలిగే పండుగ పేరుతో చిన్న జాతర నిర్వహిస్తారు. పెద్ద జాతరలో దర్శనానికి రాలేని భక్తులు.. ఈ జాతరలో మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెలపై చలువ పందిళ్లు వేశారు. భక్తుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.

భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సౌకర్యాలు ఏర్పాట్లు: జంపన్న వాగుకు ఇరువైపులా స్నాన ఘట్టాలు, జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులను ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాల సౌకర్యాలు కల్పించారు. పారిశుద్ధ్య పనుల కోసం 300 మంది కార్మికులను నియమించారు. మినీ జాతరలో నాలుగు నుంచి ఐదున్నర లక్షల మంది భక్తులు తల్లుల దర్శనానికి వస్తారన్న అంచనాతో తగిన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మేడారానికి వచ్చే భక్తుల కోసం హనుమకొండ, వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

"ఈ జాతరకు దాదాపుగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు భక్తులు వస్తారు. వీరందరికి కావాల్సిన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోలీసులు వారికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం." -సిద్ధబోయిన జగ్గారావు, మేడారం జాతర ప్రధాన పూజారి

"మేము ప్రతి సంవత్సరం జాతరకు వస్తాం. చిన్ని జాతర ,పెద్ద జాతర అని ఆలోచించం. మేము తల్లిని నమ్ముకున్నాం. మేము కోరిన కోర్కెలు తీరుస్తుందని నమ్ముతున్నాం." -భక్తురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.