ETV Bharat / state

తల్లి అంత్యక్రియలకు వెళ్లి.. కొడుకు దుర్మరణం

author img

By

Published : Feb 16, 2020, 1:17 PM IST

తల్లి మరణ వార్తతో కుంగిపోయిన ఓ విశ్రాంత సీఐ ఆమె అంత్యక్రియలకి సొంతూరికి బయలుదేరాడు. మార్గమధ్యలో వారు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టగా..దంపతులిద్దరూ మరణించారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్​ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్​పేట సమీపంలో జరిగింది.

car accident in penchikalpet at telangana state
తెలంగాణలోని పెంచికల్​పేటలో కారును ఢీకొన్న లారీ

తెలంగాణలోని పెంచికల్​పేటలో కారును ఢీకొన్న లారీ

తల్లి అంత్యక్రియలకోసం వెళ్లి ప్రమాదంలో కుమారుడు, కోడలు మరణించిన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లా పెంచికల్​పేట సమీపంలో జరిగింది. అమ్మని ఆఖరి చూపు చూసేందుకు కొడుకు, కోడలు ఖమ్మం నుంచి ఆదిలాబాద్​ బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆ దంపతులిద్దరూ చనిపోయారు.

పెంచికల్​పేట సమీపంలో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. చాట్ల విజయ్​కుమార్- సునీత దంపతులు అక్కడికక్కడే మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ వర్ధన్​రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: గొర్రెపిల్లలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.