ETV Bharat / state

నందిగామలో డ్రైనేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు

author img

By

Published : Jun 19, 2021, 10:32 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో డ్రైనేజీ నిర్మాణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. డ్రైనేజీ నిర్మాణం కోసం అధికారులు రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడానికి సిద్ధమయ్యారు. స్థానికులు ఆ పనులను అడ్డుకున్నారు. తమకు ఇళ్లు కేటాయించిన తర్వాతే తొలగింపు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

drainage works stops
drainage works stops

నందిగామలో డ్రైనేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న స్థానికులు

కృష్టా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని భారత్ టాకీస్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. డ్రైనేజీ నిర్మాణం కోసం రహదారి పక్కన నిర్మాణాల తొలగింపునకు అధికారులు ప్రయత్నించారు. ప్రొక్లెయిన్​తో ఇల్లు తొలగిస్తుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఓ వ్యక్తి ప్రొక్లెయిన్​కు అడ్డుగా రహదారిపై పడుకుని నిరసన తెలిపాడు. మరో వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నంచగా.. స్థానికులు అడ్డుకున్నారు.

తాము ఎన్నో ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్నామని.. ఇప్పటికిప్పుడు వెళ్లిపొమ్మంటే ఎటువెళ్లాలని స్థానికులు.. అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కేటాయించిన తర్వాతే తొలగింపు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఇద చదవండి: పెద్దాపురం ఎన్​ఎస్పీ కాలువ వద్ద అక్రమ తవ్వకాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.