ETV Bharat / state

కానిస్టేబుళ్లపై కేసు నమోదులో నిర్లక్ష్యం.. ఎస్​ఐ సస్పెన్షన్​

author img

By

Published : May 12, 2020, 3:42 PM IST

కృష్ణలంక పోలీస్​స్టేషన్​ ఎస్​ఐను సస్పెండ్​ చేస్తూ సీపీ ద్వారక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసేందుకు నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఈ మేరకు సీపీ ఉత్తర్వులు ఇచ్చారు.

krishnalanka si suspended
కానిస్టేబుళ్లపై కేసు నమోదులో నిర్లక్ష్యం ఎస్​ఐ సస్పెన్షన్​

అక్రమంగా మద్యం కలిగి ఉన్నారన్న ఆరోపణలకు సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు కృష్ణలంక ఎస్​ఐను సస్పండ్​ చేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లను గతంలో సీపీ ద్వారక తిరుమలరావు అక్రమంగా మద్యం కలిగి ఉన్నారన్న అంశంపై సస్పెండ్​ చేశారు. వారిపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ ఎస్​ఐ నిర్లక్ష్యం వహించాడు. ఈ విషయం సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ జరిపి ఎస్​ఐను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి...

వాలంకలో పోలీసులు, గ్రామస్థుల మధ్య దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.