ETV Bharat / state

అమ్మవారే ఇంటింటికీ వెళ్తారు.. ఇదే అక్కడి ప్రత్యేకత..!

author img

By

Published : Mar 18, 2022, 11:51 AM IST

Goddess Nancharamma: సాధారణంగా కష్టాలు, బాధలు చెప్పుకొనేందుకు భక్తులు ఆలయానికి వెళుతుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం.. అమ్మవారే ఊళ్లోని ప్రతి గడపా తొక్కుతారు. ఇంటింటికీ వెళ్లి పూజలు అందుకుంటారు. భక్తుల కోర్కెలు తీర్చుతారు. ఇంతకీ ఆ దేవత ఎవరు..? ఎక్కడ వెలిశారు..? ఏమిటి ఆ గ్రామ ప్రత్యేకత..? తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే.

Goddess Nancharamma
అమ్మవారే ఇంటింటికి వెళ్లడం

Goddess Nancharamma: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ చెరువుగట్టున శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు కొలువుదీరారు. సుమారు 200 సంవత్సరాల పూర్వం కోడూరు మండలం విశ్వనాథపల్లె నుంచి రజకుల ద్వారా పెదప్రోలుకు అమ్మవారు వచ్చినట్లు ప్రతీతి. అమ్మవారికి ఏటా మార్చి నెలలో జాతర నిర్వహిస్తారు. ఈ వేడుకకు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

అమ్మవారే ఇంటింటికి వెళ్లడం అక్కడి ప్రత్యేకత

ఊరేగింపుగా ఇంటింటికీ..

సహజంగా భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు మాత్రం.. మార్చి నెలలో జాతర ప్రారంభమయ్యాక 15 రోజుల పాటు ఊరేగింపుగా ఇంటింటికీ వెళతారు. వారి నట్టింట కొన్ని గంటలపాటు ఉంటారు. అమ్మవారు రాగానే ఇంటిల్లపాదీ గారెలు, బూరెలు, పాయాసం, పిండివంటలు నైవేద్యంగా సమర్పిస్తారు. తోబుట్టువుగా భావించి పట్టుచీరలు ఇచ్చి సాగనంపుతారు. అమ్మవారు ఇంట్లో అడుగుపెడితే కష్టాలన్నీ తొలగిపోయి.. సౌభాగ్యం వస్తుందన్నది గ్రామస్థుల విశ్వాసం. ఇప్పటికే ఊళ్లోని ఇంటింటికీ వెళ్లి అమ్మవారు పూజలు అందుకున్నారు. నేడు అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీ అద్దంకి నాంచారమ్మను సుమారు లక్ష మంది భక్తులు దర్చించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈమేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

గుడిలో వివాహం చేసుకున్న వారికి ఉచితంగా వస్తువులు..
నాంచారమ్మ గుడిలో వివాహం చేసుకున్న జంటలకు.. పెళ్లికి కావాల్సినవన్నీ ఉచితంగా అందిస్తారు. ఇప్పటివరకూ 250 జంటలకు ఆలయ కమిటీ సభ్యులు సాయం చేశారు. కూరపాటి కోటేశ్వరరావు అనే వ్యక్తి లక్షల రూపాయలు ఖర్చుచేసి.. గాలిగోపురం, ప్రాకార మండపం , ఇతర నిర్మాణాలు చేయించారు. ఈ గుడి ప్రైవేటు దేవాలయంగా కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

holi : రంగుల కేళి... హోలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.