ETV Bharat / state

సింగపూర్‌లో నాలుగో అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవాలు

author img

By

Published : Aug 16, 2020, 8:14 AM IST

తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నాలుగో అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఆన్​లైన్​లో భాగవత పారాయణం, భాగవత పద్య పఠనం, శ్రీ సూక్త పఠనం పోటీలు నిర్వహించారు

Fourth International Bhagavata Jayanti Celebrations in Singapore
సింగపూర్‌లో నాలుగో అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు

తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో సింగపూర్‌లో నాలుగో అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆన్​లైన్​లో భాగవత పారాయణం, భాగవత పద్య పఠనం, శ్రీ సూక్త పఠనం పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు 200 మంది పిల్లలు వివిధ సాంస్కృతిక పోటీలలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో ఎంపికైన 25 మంది వివిధ ప్రాంతాల నుంచి తమ కళలను ప్రదర్శించారు. మన దేశంతోపాటు సింగపూర్, ఇతర దేశాల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమృతానంద సరస్వతి విశిష్ట అతిథిగా పాల్గొని భాగవత ప్రాశస్త్యాన్ని వివరించారు. భాగవత ప్రచారానికి కృషి చేస్తోన్న డాక్టర్ మురళీ మోహన్‌ని నిర్వాహకులు.. భాగవతరత్న పురస్కారంతో సత్కరించారు. పెద్ది సాంబశివరావు 'తెలుగుభాగవతం.ఆర్గ్' నుంచి సమకూర్చిన "పోతనామాత్య భాగవత పరిచయం - అష్టమ స్కంధం" డిజిటల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అంతర్జాలంలోని తెలుగు వారందరికీ ఉచితంగా అందజేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు.

ఇదీ చూడండి. 'స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.