ETV Bharat / state

Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​..

author img

By

Published : Aug 26, 2021, 12:45 PM IST

Updated : Aug 26, 2021, 5:30 PM IST

నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​
నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్​

12:40 August 26

ప్రభుత్వ ఖజానాలో రూ. 1.2 కోట్లు జమా

ప్రధాన నిందితుడి నుంచి ప్రభుత్వ ఖజానాలో రూ. 1.2 కోట్లు జమా

     కృష్ణా జిల్లాలో నకిలీ చలానాల కేసు దర్యాప్తులో పురోగతి కనిపిస్తోంది. మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన నకిలీ చలనాలు వ్యవహారంలో ప్రధాన నిందితుడైన స్టాంపు వెండర్ దీరజ్​ను అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. ఈ మేరకు కైకలూరు టౌన్​ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లో 640 నకిలీ చలనాలలో 450 చలానాలకు సంబంధించి రూ. కోటి రెండు లక్షల నగదును ప్రభుత్వ ఖజానాలో జమ చేయించినట్లు తెలిపారు.

 నకిలీ చలానాల కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవరసం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఏ స్థాయి వాళ్లు ఉన్నా. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ILLEGAL EARNING: తండ్రి స్థానంలో కూర్చొని.. ఏడాదిలో రూ.కోట్లు కాజేసి

Last Updated : Aug 26, 2021, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.