ETV Bharat / state

'కాసుల కోసం ప్రజలపై పన్నుల భారం'

author img

By

Published : Apr 13, 2021, 8:48 PM IST

సామాన్యులపై భారం మోపే విధంగా కేంద్రం అవలంభిస్తున్న వైఖరిపై వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆక్షేపించారు. అన్నదాతను ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు.

vadde fired on government
కాసుల కోసం కేంద్ర రాష్ట్రాలు ప్రజలపై పన్నుల భారం

కొత్తగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని.. గతంలో అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయని ఆయన అన్నారు. పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కుతూ కాసుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బడా బాబులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువులపై పన్నులు ఇష్టం వచ్చినట్లు పెంచారని ఆయన మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు నెలలో నాలుగుసార్లు పెంచి సామాన్యులపై అధిక భారం మోపడాన్ని తప్పుపట్టారు. వీటి ప్రభావంతో రోజువారి కూలీ పని చేసుకునే వారు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ఇదీ చదవండి: దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్​'!

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే తమ బతుకులు రోడ్డున పడటం ఖాయమని ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ధర్నాలు చేపడుతున్నా.. మోదీ ప్రభుత్వానికి చలనం లేదని దుయ్యబట్టారు. ఈ పరిణామాలను దేశవ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఓటు అస్త్రంతో ప్రజలు మోదీకి తగిన బుద్ధి చెప్పి.. గద్దె దించే రోజు దగ్గర పడిందని వడ్డే అన్నారు.

ఇదీ చదవండి:

కూన రవికుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.