ETV Bharat / state

AP Employees Round Table Meeting: విజయవాడలో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

author img

By

Published : Jan 23, 2022, 3:58 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు గళమెత్తుతున్నారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.

round table meetings at vijayawada
round table meetings at vijayawada

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు.. సన్నాహ భేటీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని.. విజయవాడలో జరిగిన సమావేశంలో పీఆర్సీ సాధన సమితి నేతలు తేల్చిచెప్పారు.

విజయవాడలో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

మేం కూడా పాల్గొంటాం- ఆర్టీసీ సిబ్బంది

సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొని విజయవంతం చేస్తారని ఎన్​ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు సంఘటితంగా పోరాడి డిమాండ్లను సాధించుకుంటామని ముక్తకంఠంతో నినదించారు.

కొత్త పే స్కేళ్లపై కసరత్తు...

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే ఖజానా ఉద్యోగుల సర్వీసు అసోసియేషన్‌ తాము ఈ ప్రక్రియలో పాల్గొనబోమని ప్రభుత్వానికి తెలిపింది. ఆ సంఘం నాయకులు పి.శోభన్‌బాబు, రవికుమార్‌ ఉన్నతాధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. తాజాగా పే అండ్‌ అకౌంట్సు ఉద్యోగుల సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వరరెడ్డి, పి.శివప్రసాద్‌ కూడా ఉన్నతాధికారులను కలిసి తాము పీఆర్సీ అమలు ప్రక్రియలో పాల్గొనబోమని తేల్చిచెప్పారు.

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ రెండ్రోజుల కిందట వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో రవి సుభాష్‌, ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు, పే అండ్‌ అకౌంట్సు అధికారి కె.పద్మజ, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస పూజారి, జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ ఖజానా అధికారులు, ఉప ఖజానా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఖజానా శాఖ నిత్యం ఏమేం చేయాలనే దానిపైనా రావత్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.