ETV Bharat / state

ఈటివీ భారత్ కథనానికి స్పందన... పేదలకు అందిన సాయం

author img

By

Published : Oct 23, 2020, 9:23 AM IST

Updated : Oct 23, 2020, 1:41 PM IST

ఒక్క పూటే తింటూ పస్తులతో గడుపుతున్న పేదలకు 'ఈటీవీ భారత్'​ చొరవతో సాయం అందింది. కృష్ణానది తీరాన్ని ఆవాసంగా చేసుకుని జీవితాన్ని గడుపుతున్న వారి కష్టాలపై 'ఈటీవీ భారత్' ప్రచురించిన కథనానికి స్వచ్ఛంద సంస్థలు, అధికారులు స్పందించారు. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

etv bharat effect
సాయమందిస్తున్న అథికారులు, స్వచ్ఛంద సంస్థలు

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నాగాయతిప్ప సరిహద్దులో కృష్ణా నది తీరంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలకు సాయం అందింది. 'కృష్ణా నది ఒడ్డే అవాసం..ఒక్క పూటే భోజనం' శీర్షికన 'ఈటీవీ భారత్' వెలువరించిన కథనానికి అధికారులు, దాతలు స్పందించారు. పురిటిగడ్డకు చెందిన 'ఇండి విలేజ్ మినిస్ట్రీస్' సంస్థ అధినేత వేములపల్లి సురేష్... బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతి నెలా వారికి కావాల్సిన సరకులు అందిస్తామన్నారు. ప్రభుత్వం స్థలం చూపిస్తే.. తమ సంస్థ ద్వారా వీరికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

మోపిదేవి మండల తహసీల్దార్ కె.మస్తాన్.. బాధితుల కుటుంబాలకు 500 రూపాయలతో పాటు నిత్యావసరాలు అందజేశారు. జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్... వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినా.. పేదలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

మోపిదేవిలో రెేషన్ కోసం ప్రజల పడిగాపులు

Last Updated :Oct 23, 2020, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.