ETV Bharat / state

కర్నూలు రోడ్డు ప్రమాదంపై.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

author img

By

Published : Feb 14, 2021, 10:27 AM IST

Updated : Feb 14, 2021, 3:14 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందటం అత్యంత బాధకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కర్నూలు రోడ్డు ప్రమాదంపై.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
కర్నూలు రోడ్డు ప్రమాదంపై.. చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ప్రమాదంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందటం అత్యంత బాధకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. అరకు, వెల్దుర్తి ఘోర ప్రమాదాల దృష్ట్యా...ప్రయాణికులతో కూడిన వాహనాలు నడిపే డ్రైవర్లకు రహదారి భద్రతపై తగిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి...: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం

Last Updated : Feb 14, 2021, 3:14 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.