ETV Bharat / state

Chandrababu: 'దాడులకు భయపడం.. మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు'

author img

By

Published : Jul 31, 2021, 12:00 PM IST

Updated : Jul 31, 2021, 12:15 PM IST

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు తీరును తప్పుబట్టారు. తప్పు జరగకుంటే.. తమ పార్టీ నిజ నిర్ధరణ బృందాన్ని ఎందుకు కొండపల్లికి వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. దేవినేని ఉమా కుటుంబీకులను పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

చంద్రబాబు పరామర్శ
చంద్రబాబు పరామర్శ

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ఆగ్రహం

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబీకులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉమాపై కేసు పెట్టడం చాలా దుర్మార్గమని ఆగ్రహించారు. వైకాపా నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారన్న చంద్రబాబు.. ఎస్సీలపై దాడిచేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. కొండపల్లి బొమ్మలు తయారుచేసే చెట్లను కొట్టేస్తున్నారని.. అక్రమ మైనింగ్‌ జరుగుతోందని చెప్పినా పట్టించుకోలేదని ప్రభుత్వం, అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశఆరు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్తామంటే నిర్బంధిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

దేవినేని ఉమా కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

"అక్రమ మైనింగ్‌ జరగకపోతే తెదేపా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్రంలో రౌడీ, గూండాలు, నేరస్థుల రాజ్యముందా? పరిపాలన చేతగాక... అక్రమ కేసులే పనిగా పెట్టుకున్నారు. పోలీసులు ఇంత నీచంగా ఎప్పుడూ పని చేయలేదు. అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేస్తే ఎందుకు పోనివ్వరు? అక్రమ మైనింగ్ జరగకపోతే నిజనిర్ధరణ కమిటీని ఎందుకు అడ్డుకుంటున్నారు? పోలీసులు దారిమళ్లించి.. దాడి జరిగే ప్రాంతం వైపు ఉమను వెళ్లేలా చేశారు. దాడులకు తెదేపా భయపడదు. తెదేపాతో పెట్టుకున్నవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు" - చంద్రబాబు, తెదేపా అధినేత

కోడెల శివరాం గృహ నిర్బంధం..

దేవినేని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా..నరసరావుపేటలో తెదేపా నేత కోడెల శివరాంను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నరసరావుపేటలోని తన నివాసం నుంచి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి:

Tdp Fact Finding comity: నేడు కొండపల్లికి తెదేపా నిజనిర్ధరణ కమిటీ.. నేతల హౌజ్ అరెస్ట్

Live Updates: 'కొండపల్లికి తెదేపా కమిటీ'.. భారీగా పోలీసుల మోహరింపు..

Last Updated : Jul 31, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.