ETV Bharat / state

BJP Wilson ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుకు సీఎం జగన్ అర్హుడు: విల్సన్

author img

By

Published : Apr 25, 2023, 6:34 PM IST

Bjp : దళితుల నిధులు దారి మళ్లించి మోసం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదుకు అర్హుడని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌ డీ విల్సన్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిధులను దారి మళ్లిస్తున్న ఈ ప్రభుత్వంలో ఎలా కొనసాగుతున్నారో దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

Bjp : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదుకు అర్హుడని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌, బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌ డీ విల్సన్‌ అన్నారు. జగన్ పాలనలో ఎస్సీ కార్పోరేషన్‌కు ఒక్క రూపాయి కేటాయించలేదని... జయహో ఎస్సీ అని చెప్పుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఎస్సీల అభ్యున్నతికి జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డబ్బులను కూడా ఇతర అవసరాలకు మళ్లించారని, ఎస్సీల నిధులే కాదు.. వారి భూములను కూడా లాగేసుకున్నారన్నారు. ఎక్కడా శిక్షణ కార్యక్రమాలు లేవని, ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. దళితులను ఉధ్దరించినట్లు చెబుతున్న వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలపై త్వరలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని తెలిపారు.

ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.. నేను చైర్మన్ గా ఉన్నపుడు ప్రతి జిల్లాకు తక్కువలో తక్కువగా 10 కోట్ల రూపాయలు ఇచ్చాను... కానీ, ఇప్పుడున్న చైర్మన్లు మాల, మాదిక, రెల్లి పేర్లతో మూడు ముక్కలు చేశారని విల్సన్ మండిపడ్డారు. ఇప్పుడున్న చైర్మన్లు ఎస్సీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, ఎస్సీలకు ఏం చేశారని జయహో ఎస్సీ అంటారని ప్రశ్నించారు. భారత దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఎస్సీ కార్పోరేషన్ డబ్బులను దారి మళ్లించిన ఉదంతాల్లేవు అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే డబ్బులు ఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్కేఎఫ్ డీసీ, ఎన్బీఎఫ్డీసీ, మైనార్టీ కార్పోరేషన్లకు ఇచ్చే నిధులను డైవర్ట్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందా? అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి జగన్ మోహన్ రెడ్డి అర్హుడు అని విల్సన్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు రూపాయి కూడా ఇవ్వడం లేదు. కానీ కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించడం చారిత్రక తప్పిదం. జగన్ హయాంలో ఎస్సీ కార్పోరేషన్ పథకాలను మళ్లించడమే గాకుండా ఎస్సీలకు సంబంధించి భూ కొనుగోలు, కార్లు, ఇన్నోవాలు, టెంట్ హౌస్, స్వయం ఉపాధి పథకాలు అమలు కావడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణా తరగతులు, గ్రూప్ 1, ఎస్ ఐ, టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాలు లేకుండా చేశారు. ఇవేవీ లేకుండా చేసిన వ్యక్తిని జయహో ఎస్సీ అని ఎలా అంటారు. పైగా 50వేల కోట్లకు పైనే ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు. అమ్మఒడి, జగనన్న దీవెన పథకాల లబ్ధిదారుల్లో కూడా ఎస్సీలను చూపి మీడియాను కూడా మభ్యపెడుతున్నారు. దళితులు కోరుకునే భూ కొనుగోలు పథకానికి నిధులు కేటాయిస్తున్నారా..? ఎస్సీలకు సంబంధించి సీఎం చేస్తున్న దర్మార్గాలు అందరికీ తెలుసు.. ఇవన్నీ తెలిసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. - ఆర్‌డీ విల్సన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌

బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.