ETV Bharat / state

'బహిరంగ చర్చకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి'

author img

By

Published : Dec 27, 2020, 10:54 PM IST

అమరావతిపై బహిరంగ చర్చకు వస్తే నిజాలేమిటో తెలుస్తాయని వైకాపా ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. అమరావతి గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేశ్​లకు లేదని దుయ్యబట్టారు.

bapatla mp nandigam suresh demand to tdp leaders that debate on amaravathi issue
వైకాపా ఎంపీ నందిగం సురేష్

అమరావతిపై ఆరోపణలు చేస్తున్న తెదేపా నేతలు బహిరంగ చర్చకు వస్తే వాస్తవాలేమిటో తెలుస్తాయని గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. అమరావతిపై చర్చకు తాము సిద్ధమని.. చంద్రబాబు, లోకేశ్​ సిద్ధమా అని సవాల్ విసిరారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు తెదేపా నేతలకు, జేఏసీ నేతలకు లేదన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ ఉద్యమాలు ఆపాలని కోరారు.

ఇదీచదవండి.

వైకాపా నేతల ఒత్తిడితోనే ప్రియాంక ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.