ETV Bharat / state

Mana Badi Nadu Nedu: మన బడి, నాడు-నేడు రెండో దశ పనులు భారీగా కుదింపు

author img

By

Published : Feb 22, 2022, 12:45 PM IST

Updated : Feb 23, 2022, 4:12 AM IST

mana badi nadu nedu phase 2 works
mana badi nadu nedu phase 2 works

mana badi nadu nedu phase 2 works: మన బడి, నాడు-నేడు రెండో దశ పనులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల లేమితో పనులను భారీగా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 3,199 పాఠశాలల్లోనే నాడు-నేడు రెండో దశ పనులు చేయాలని నిర్ణయించారు.

mana badi nadu nedu phase 2 works: నబడి, ‘నాడు-నేడు’ కింద రెండోదశలో పనులు చేపట్టే విద్యాసంస్థల సంఖ్యను ప్రభుత్వం భారీగా కుదించింది. నిధుల కొరతతోనే ఈ చర్య తీసుకుంది. రెండో విడతలో 16,368 విద్యాసంస్థల్లో రూ.4,535 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు గతేడాది ఆగస్టు 16న ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాటినుంచి పనులే ప్రారంభం కాలేదు. తాజాగా రూ.2,538.96 కోట్లతో 3,199 పాఠశాలల్లోనే ఈ పనులకు పరిపాలన అనుమతులు మంజూరుచేసింది. నాబార్డు నుంచి రుణం, ప్రభుత్వ వాటా కాకుండా మిగతా మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విరాళాలను తీసుకోవాలని నిర్ణయించింది. నూతన విద్యావిధానం అమల్లో భాగంగా 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో అదనపు తరగతి గదుల అవసరం ఏర్పడింది.

.

నాబార్డు రుణం రూ.1,379 కోట్లతో 1,196 బడుల్లో సుమారు 11,485 అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అంచనాలు రూపొందించారు. మరో 2003 బడుల్లో నాబార్డు నిధులు రూ.1,161 కోట్లతో అదనపు తరగతి గదులు, ఇతర మౌలికసదుపాయాలు కల్పించనున్నారు. నాబార్డు నిధులకు 30% ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు ఇవ్వాలి. అదనపు తరగతి గదులు నిర్మించేవాటిలో కొన్ని మొదటి విడత పాఠశాలలు ఉన్నాయి. మొదటి విడత పనులను ప్రపంచబ్యాంకు బృందం పరిశీలిస్తోంది. ఈ పనులకు ప్రపంచబ్యాంకు నిధులు వస్తే వాటిని రెండో విడతకు వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.

మొదటి విడతకే బకాయిలు

‘నాడు-నేడు’ మొదటి విడత పనులకు రూ.323 కోట్ల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విడతలో 15,715 పాఠశాలల్లో పనులు చేపట్టగా.. ఇప్పటికీ 7% బడుల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. గతేడాది ఆగస్టు 16న రెండోవిడత ప్రారంభమైనట్లు ప్రకటించగా.. ఆరు నెలలు గడిచినా పనులు ప్రారంభమే కాలేదు. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో డ్యుయల్‌ డెస్క్‌లు, ఇతర పనుల కోసం పిలుస్తున్న టెండర్లలో గుత్తేదార్లు అధిక ధరలు కోట్‌ చేస్తున్నారు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపైనా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇదీ చదవండి

Case on Ayyannapatrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు.. ఎందుకంటే

Last Updated :Feb 23, 2022, 4:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.