ETV Bharat / state

Ap Cs Jawahar Reddy Review On Sdg Works: ఏపీలో ఎస్​డీ​జీ సమన్వయ కేంద్రం ఏర్పాటుపై సమీక్ష.. పనుల వేగవంతంపై సీఎస్ ఆదేశాలు..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 1:34 PM IST

AP CS Jawahar Reddy Review on SDG Works: ఐరాస కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సమన్వయ కేంద్రం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కేఎస్​ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శికి సూచించారు. దీంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కోసం కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

AP_CS_Jawahar_Reddy_Review_on_SDG_Works
AP_CS_Jawahar_Reddy_Review_on_SDG_Works

AP CS Jawahar Reddy Review on SDG Works: ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సమన్వయ కేంద్రం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్​ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్​ను ఆదేశించారు. రాష్ట్రంలో యూఎస్​డీపీ, ఎస్​డీజీ సెంటర్ల ఏర్పాటు పనుల ప్రగతిని సమీక్షించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో 17 అంశాల్లో సుస్థిర అభివృద్ధి , 169 నిర్థేశిత లక్ష్యాల సాధనకు సమన్వయ కేంద్రం ఏర్పాటు తప్పనిసరన్నారు.

CS Review: పెండింగ్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష.. పనుల పురోగతిపై ఆరా

AP CS Jawahar Reddy on SDG Works: పేదరిక నిర్మూలనతో పాటు వివిధ సమ్మిళిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికల్లా సాధించాల్సి ఉందని సీఎస్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఏపీలో యూఎస్​డీపీ సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధన కోసం సమన్వయ కేంద్రం అవసరమని అన్నారు. ఇప్పటికే హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, కర్నాటక, నాగాలాండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ సెంటర్లను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలోనూ ఈ కేంద్రాన్ని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రణాళికా శాఖ అధికారులకు ఆయన సూచించారు.

CS Review On Aarogya Suraksha Program: దీంతోపాటు ఈ నెల 15 తేదీ నుంచి చేపట్టనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 15 నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించటంతో పాటు సర్వే చేపడుతున్న వైద్యారోగ్య సిబ్బందికి ప్రచార సామాగ్రిని, టెస్టింగ్ కిట్లను, ఔషధాలను అందజేయాలని సూచించారు.

Global Summit Review: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ఒప్పందాలపై సీఎస్ సమీక్ష..

Jagananna Aarogya Suraksha Program: ఆరోగ్య సింబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో సాధారణ వ్యాధులతో పాటు దీర్ఝకాలిక వ్యాధులు, గర్బిణీలు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు వంటి సంక్రమించే, సంక్రమంచని వ్యాధులతో బాధపడుతున్న వారికి తక్షణ సేవలందించేలా చూడాలని సూచించారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడ ప్రజలకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే తగు వైద్యసేవలు అంజేయాలని పురపాలక, పట్టణాభివృద్ది శాఖకు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించి ఔషధాలు అందించాల్సిందిగా సూచనలిచ్చారు. సెప్టెంబరు 30 తేదీ నుంచి ప్రతి మండలంలో రోజుకు కనీసం ఒక వైద్య శిబిరం చొప్పున 685 మండలాల్లో ప్రణాళికా బద్ధంగా వీటిని నిర్వహించాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.