ETV Bharat / state

కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం.. కొత్త పేరు ఏంటంటే !

author img

By

Published : May 18, 2022, 3:33 PM IST

Updated : May 18, 2022, 9:10 PM IST

కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం
కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వ నిర్ణయం

15:31 May 18

నెల రోజులు అభ్యంతరాలు స్వీకరణ

Konaseema District name change: కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోనసీమ జిల్లా పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్చింది. పేరు మార్పుపై నెల రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు కలెక్టర్‌కు తెలపాలంటూ ప్రాథమిక నోటిఫికేషన్​లో తెలిపింది.

ఇవీ చూడండి

Ambedkar District:'కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్​ జిల్లాగా మార్చాలి'

ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది.. ఇక ఆపలేరు: చంద్రబాబు

Lepakshi: లేపాక్షి అందాలు చూసి తీరాల్సిందే!

Last Updated :May 18, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.