ETV Bharat / state

కోనసీమ జిల్లాలో వింత ఘటన.. భూమిలో నుంచి వేడి ఆవిర్లు

author img

By

Published : Jul 12, 2022, 10:15 PM IST

Hot vapors from the ground: కోనసీమ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. భారీవర్షాలకు నేల తడిసిముద్దవుతుంటే ఆ ఇంటి ఆవరణం మాత్రం ఒక్కసారిగా వేడెక్కింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. మరోవైపు నేల నుంచి వేడి ఆవిరి బయటకు వస్తోంది. ఈ వింతను తిలకించేందుకు చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుంటున్నారు.

భూమిలో నుంచి వేడి ఆవిర్లు
భూమిలో నుంచి వేడి ఆవిర్లు

కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు వర్షం కురుస్తుంటే అందరూ ఇళ్లలో చలితో వణుకుతుంటే.. ఆ ఇంటి ఆవరణం మాత్రం వేడెక్కుతోంది. ఓ వైపు వాన పడుతుంటే.. మరోవైపు భూమిలో నుంచి వేడి ఆవిర్లు బయటకు వస్తున్నాయి. అది గమనించిన ఆ ఇంటి యజమాని గోపాలరాజు.. ఆ ప్రదేశంలో తవ్వి చూశాడు. ఆ గోతిలో నుంచి వేడి ఆవిర్లు రావటం గమనించాడు. అక్కడ తీసిన మట్టిసైతం వేడిగా ఉందని గోపాలరాజు తెలిపారు.

కోనసీమ జిల్లాలో వింత ఘటన.. భూమిలో నుంచి వేడి ఆవిర్లు..

ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు ఆ వింతను చూడటానికి బారులు తీరారు. బహుశా ఆ ప్రాంతంలో భూమి కింద నుంచి చమురు సంస్థలకు సంబంధించిన పైపులైను ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.