ETV Bharat / sports

బుమ్రా, రోహిత్ సూపర్​ షో.. తొలి వన్డేలో ఇంగ్లాండ్​పై భారత్​ రికార్డు విజయం

author img

By

Published : Jul 12, 2022, 9:27 PM IST

Updated : Jul 12, 2022, 9:48 PM IST

india team super victory against england one day match at oval london
బుమ్రా, రోహిత్ సూపర్​ షో.. తొలి వన్డేలో ఇంగ్లాండ్​పై భారత్​ రికార్డు విజయం

21:24 July 12

బుమ్రా, రోహిత్ సూపర్​ షో.. తొలి వన్డేలో ఇంగ్లాండ్​పై భారత్​ రికార్డు విజయం

తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా వికెట్‌ నష్టపోకుండా పూర్తి చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (76 నాటౌట్​), శిఖర్ ధావన్‌ (31 నాటౌట్​) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

మొదట బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్‌.. బుమ్రా (6/19) దెబ్బకు 110 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ ఎదుట 111 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. జోస్‌ బట్లర్‌ (30), డేవిడ్ విల్లే (21), కార్సే (15), మొయిన్ అలీ (14) మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేశారు. మిగతావారిలో బెయిర్‌స్టో 7, ఓవర్టన్‌ 8, టోప్లే 6( నాటౌట్​) పరుగులు చేయగా.. జాసన్‌ రాయ్‌, జో రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్ డకౌట్‌గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో బుమ్రా కాకుండా షమీ 3, ప్రసిధ్ ఒక వికెట్ తీశారు.

Last Updated : Jul 12, 2022, 9:48 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.