ETV Bharat / state

కేశవరంలో గ్రావెల్‌ రగడ-చల్లారని ఎర్రమట్టి తవ్వకాల చిచ్చు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 7:24 AM IST

Updated : Nov 9, 2023, 12:21 PM IST

Gravel Mining Dispute in Kesavaram Hills: పచ్చదనంతో కళకళలాడిన ఎర్రమట్టి కొండ అది. అడ్డూఅదుపూ లేని తవ్వకాలతో ఆ కొండ కరిగిపోతోంది. పేదల కాలనీలల్లో మెరక, ఇతర అభివృద్ధి పనుల పేరు చెప్పి అధికారపార్టీ నేతలు నిత్యం వందల లారీల్లో మట్టి తరలిస్తున్నారు. కోనసీమ జిల్లా కేశవరం కొండల్లో గ్రావెల్ తవ్వకాల వ్యవహారం వివాదమై రాజకీయ దుమారం రేపుతోంది.

Gravel_Mining_Dispute_in_Kesavaram_Hills
Gravel_Mining_Dispute_in_Kesavaram_Hills

కేశవరంలో గ్రావెల్‌ రగడ-చల్లారని ఎర్రమట్టి తవ్వకాల చిచ్చు

Gravel Mining Dispute in Kesavaram Hills : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం వద్ద ఎర్రమట్టి నిల్వలున్న కొండ ఉంది. స్థానికంగా దీన్ని కర్రవాని మెరక అని పిలుస్తారు. ఈ కొండపై 5 హెక్టార్లలో గ్రావెల్ తవ్వకాలకు భూ గర్భ, గనుల శాఖ (Department of Mines) అనుమతి ఇచ్చింది. రెండున్న లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి ఉచితంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో (YSR Jagananna Colonies) మెరక పనులు, పునాదుల మధ్య నింపడానికి, ఇతర అవరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.

Illegal Soil Mining in AP : ఈ మట్టిని మండపేట నియోజకవర్గ పరిధిలోనే వాడాలన్న నిబంధనలు విధించారు. అయితే తవ్వకాలు అనుమతులకు మించి సాగుతున్నాయని నిల్వలు పరిధి దాటి రవాణా అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, తవ్వకాల ప్రాంతంలో ప్రైవేటు సైన్యం పహారా, పగలు, రాత్రి తేడా లేకుండా లారీలు మండపేట, బొమ్మూరు, అనపర్తి వైపు సాగిపోతున్నాయి.

కేశవరం గ్రావెల్‌ అక్రమ తవ్వకాల పరిశీలనకు టీడీపీ పిలుపు - నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు

లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించని ప్రభుత్వం : తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండపై పట్టాలు పొందిన లబ్దిదారులకు నేటికీ స్థలాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. పేదల ఇళ్లకు అనువైన స్థలాలు ఎంచుకోకుండా కొండ ప్రాంతాన్ని చూపడమే తప్పయితే.. ఇప్పుడా కొండను మాయం చేసి అక్కడే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని నిర్ణయించడం మరో తప్పనే వాదన వినిపిస్తోంది.

TDP and Janasena Allegations on Excavations in Red Clay Hill in Konaseema District : క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల బృందం గ్రావెల్ తవ్వకాలను పరిశీలిస్తామని ప్రకటించగానే అధికార పక్షంలో ఉలికిపాటు మొదలైంది. మండపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లీలా కృష్ణను మంగళవారం గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేశారు.

YSRCP Leaders Illegal Mining అర్ధరాత్రి గ్రామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న స్థానికులు

Gravel Mining in Kesavaram : బుధవారం ఎమ్మెల్యే జోగేశ్వరరావుని అరెస్ట్ చేసి అంగర పోలీస్ స్టేషన్​కు తరలించారు. కొండను పరిశీలిస్తామని బయలుదేరిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ, జనసేన నాయకుల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనుమతులు, పేదల స్థలాల చదును పేరిటన కొండను కొల్లగొట్టి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని వారు ఆరోపించారు.

రాజకీయ ఒత్తిళ్లు : గతంలో తవ్వకాలకు కేవలం 20 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చిన యంత్రాంగం.. ఇప్పుడు కాల పరిమితి లేకుండా తవ్వకాలకు గడువు ఇవ్వడం వెనక రాజకీయ ఒత్తిళ్లే కారణమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎలాగైనా కేశవరం ఎర్రమట్టి కొండ తవ్వకాలను అడ్డుకుంటామని టీడీపీ, జనసేన నాయకులు తేల్చి చెప్పారు.

Illegal Soil Mining: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. గుల్లవుతున్న వెంకన్న కొండ

Last Updated :Nov 9, 2023, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.