పథకాలకు జగనన్న పేరు - 6 వేల కోట్లు నిలిపివేసిన కేంద్రం: యనమల

పథకాలకు జగనన్న పేరు - 6 వేల కోట్లు నిలిపివేసిన కేంద్రం: యనమల
Yanamala Ramakrishnudu fires on cm jagan: నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం నుంచి వచ్చిన రూ. 71,449 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పథకాల పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవడంతో ఏపీకివ్వాల్సిన రూ. 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందని ఆరోపించారు. జగన్ వైఖరి వల్ల కేంద్రం నుంచి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఏపీకి రాకుండా పోతున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yanamala Ramakrishnudu fires on CM Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం కోత విధిస్తోందని పేర్కొన్నారు. జగన్ కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన పేరును పెట్టుకోవడం వల్ల ఏపీకి రావాల్సిన రూ. 6వేల కోట్లు రాకుండా పోయాయని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
దోపిడీ కోసమే కేంద్రం నిధులను దారి మళ్లిస్తున్నారు: నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 71,449 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, దోపిడీకే కేంద్ర నిధులను దారి మళ్లించారని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే నిధులకు వైఎస్సార్, జగన్ పేర్లను పెట్టడంపై కేంద్రం అభ్యంతరం తెలిపిందన్నవిషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేర్ల విషయంలో జగన్ ప్రభుత్వ తీరు మారకపోవడంతో ఏపీకి ఇవ్వాల్సిన రూ. 6 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందని ఆరోపించారు. పథకాలపై పెట్టే పేర్ల కోసం జగన్ పేదలను బలి చేస్తున్నారని యనమల దుయ్యబట్టారు.
కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్లు: 75 పథకాలకు జగన్, వైఎస్సార్ పేర్లు పెట్టడం రాచరిక పోకడ కాదా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని యనమల రామకృష్ణుడు నిలదీశారు. జగన్ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. జగన్ వైఖరి వల్ల కేంద్రం నుంచి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఏపీకి రావడం లేదన్నారు. 94 కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తద్వారా బీసీ వర్గాలు అభివృద్ధికి దూరమయ్యాయని ఆరోపించారు. కొన్ని రంగాలకు వస్తోన్న కేంద్ర నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని విమర్శలు గుప్పించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, స్ఖానిక సంస్థలకు వచ్చే నిధులను పక్కదారి పట్టించారని యనమల పేర్కొన్నారు.
ఉపాధి హామీ కూలీల నిధులపై ఆరోపణలు: పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 3084 కోట్లను దారి మళ్లించారని యనమల ఆక్షేపించారు. రైతులకివ్వాలని కేంద్రం ఇచ్చిన కరవు సాయం రూ. 900 కోట్లు రైతులకు చేరలేదన్నారు. రూ. 8660 కోట్ల మేర స్థానిక సంస్థల నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని యనమల మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలకు చెందాల్సిన రూ. 7879 కోట్లను దారి మళ్లించి.. వలసలకు జగన్ ప్రభుత్వం కారణమవుతోందని వైసీపీ ప్రభుత్వంపై యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.
