ETV Bharat / state

శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 95వ వార్షిక మహాజ్ఞాన సభలు

author img

By

Published : Feb 9, 2023, 7:47 PM IST

Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham Mahasabhalu: కష్టాన్ని ఇష్టపడి స్వీకరించాలని.. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న ఈ పీఠం వార్షిక మహాజ్ఞాన సభలు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి.

1
1

Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham Mahasabhalu: కాకినాడ జిల్లాలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 95వ వార్షిక మహాజ్ఞాన సభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. పీఠం ప్రాంగణంలో 3 రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో కూడిన అరిషడ్వర్గాల వలన మానవుడు భ్రాంతి శక్తులకు లోనవుతున్నాడని అన్నారు. భ్రాంతి వలన కష్టాలను అనుభవించడానికి మానవుడు ఇష్టపడడని.. అందువల్లే తన కష్టాలు తీర్చమని స్వామీజీలను, గురువులను దర్శిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. కష్టాన్ని ఇష్టపడి స్వీకరిస్తే భ్రాంతి శక్తి తొలగిపోతుందని తెలిపారు.

అనంతరం నివేదిక 2023, వేదాంతం నుంచి జాతీయతా భావం వైపు గ్రంధాన్ని పీఠాధిపతి సభలో ఆవిష్క రించారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్​మెంట్​ట్రస్ట్ వారు చిన్నారుల కోసం పాలకేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలను, ప్రాథమిక వైద్య శిబిరాలతో పాటుగా 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సభకు ముఖ్య అతిథిగా పిఠాపురం శాసన సభ్యుడు పెండెం దొరబాబు విచ్చేశారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని శిష్యులకు బోధిస్తూ విశ్వమానవ శ్రేయస్సుకై ఈ పీఠం పాటుపడుతున్నదని అన్నారు. గురుశిష్యుల సంబంధం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని తెలిపారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్ధకమవుతుందని వెల్లడించారు. పీఠం విశిష్టతను మారుమూల పల్లెల వరకూ విస్తరింపచేసేలా శిష్యులు కృషి చేయాలని సూచించారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా చేస్తున్న సేవలను కొనియాడారు.

ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం ఈ పీఠం అనునిత్యం కృషి చేస్తున్నదని తానా చైర్మన్ తోటకూర ఈశ్వర ప్రసాద్ అన్నారు. స్త్రీ సంక్షేమం, సర్వమత సౌభ్రాతృత్వం కోసం పీఠాధిపతులు చేస్తున్న కృషిని కొనియాడారు. అసమానతలు లేని సమ సమాజాన్ని నిర్మించడానికి పాటుపడుతున్న పీఠాన్ని దర్శించడం, తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.