ETV Bharat / state

అడగ్గానే అన్ని చెబుతామా ఎంటీ - ఆ ఒక్కటే అడక్కు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 9:03 AM IST

YSRCP Keeps Secret on Debts Government Revenue and Expenditure Calculations : రాష్ట్రంలో ఇసుక టెండర్‌ నూతన విధివిధానాలేంటి. ఇవాళ్టికివాళ రాష్ట్ర అప్పులెంత.. ఆదాయమెంత. అడగ్గానే చెప్తామా ఏంటి.. కాగ్‌కే లెక్కలు చెప్పం! మీకెందుకు చెప్పాలి. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి. పారదర్శకత కోసం ప్రభుత్వ జీవోలన్నింటిని వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పట్టుబట్టిన జగన్‌.. ఇప్పుడు ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీక్రెట్ పాలన సాగిస్తున్నారు.

ysrcp_keeps_secret_on_government_revenue_expenditure_and_debt_calculations
ysrcp_keeps_secret_on_government_revenue_expenditure_and_debt_calculations

అడగ్గానే అన్ని చెబుతామా ఎంటీ - ఆ ఒక్కటే అడక్కు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం

YSRCP Keeps Secret on Government Revenue Expenditure and Debt Calculations: సీఎం డ్యాష్‌ బోర్డ్‌. ఈ పదం విని దాదాపు నాలుగున్నరేళ్లు అవుతుంది కదా. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వశాఖల సమాచారాన్ని ఎప్పటికప్పుడు.. సీఎం డ్యాష్‌ బోర్డులో ఉంచేవారు. ఇప్పుడు సీఎం ఉన్నారు.. వారి నుంచి డ్యాష్‌ బోర్డు పదమే వినిపించడం లేదు. కానీ, జగన్‌కు గత ప్రభుత్వంలోనే పారదర్శకత కనిపించ లేదు.

2014 డిసెంబర్‌లో ప్రతిపక్ష నేత హోదాలో అప్పటి సీఎం చంద్రబాబుకు జగన్‌ ఓ లేఖ కూడా రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలు, కేంద్రం నుంచి తెస్తున్న రుణాలు, ఇతర వివరాలు.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆ లేఖలో జగన్​ కోరారు. అకౌంటెంగ్‌ వ్యవస్థను కంప్యూటరీకరించినందున దానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని భావిస్తున్నానంటూ లేఖలో ముక్తాయించారు. ప్రతిపక్ష నేతగా పాలనలో పారదర్శకత కోసం అంతగా పరితపించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గప్‌చుప్‌ అంటున్నారు.

Yanamala Letter to Finance Minister అప్పులు ఎంత? బకాయిలు ఎన్ని ? కాగ్ నివేదికపై సమాధానం చెప్పండి.. మంత్రి బుగ్గనకు యనమల లేఖ

చివరికి కాగ్​కూ చెప్పడం లేదు: జగన్ పాలనంతా రహస్యమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ రోజు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియవు. అందుకు తగ్గ ఏ సమాచారమూ ఏ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచరు. ఆఖరికి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటింగ్‌ జనరల్‌-కాగ్‌కూ అనేక ఆర్థిక అంశాలు చెప్పడం లేదు. ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాల మొత్తం ఎంత అని.. ఏ నెలకు ఆ నెల తమకు వివరాలు ఇవ్వాలని కాగ్‌ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతోంది.

ప్రభుత్వం రుణాలు వివరాలు అందిచడం లేదు: ఏ నెలలో కూడా ఆ సమాచారం జగన్‌ సర్కార్‌ ఇవ్వడం లేదని కాగ్‌ ఆక్రోశిస్తూనే ఉంది. పబ్లిక్‌ అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం రుణం రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందో కూడా ప్రతి నెలా కాగ్‌ అడుగుతోంది. కానీ, ప్రభుత్వం ఆ లెక్కలూ వెల్లడించడం లేదు. ఫలితంగా రాష్ట్రం మొత్తం అప్పులు ఎంతనే విషయాలు తెలిసే ఆస్కారమే లేకుండా పోతోంది. అనేక రాష్ట్రాలు ప్రతి నెలా ప్రభుత్వ గ్యారంటీల ద్వారా ఎంత మొత్తం రుణాలు తీసుకున్నారు, ఎంత మొత్తం తిరిగి చెల్లించారు తదితర వివరాలు కాగ్‌కు సమర్పిస్తున్నాయి. ఆ వివరాలన్నీ కాగ్‌ తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. పోనీ అధికారులైనా చెప్తారా అంటూ దేనికి సమాధానం ఉండదు.

Andhra Pradesh Top in Debts: ఐ డోంట్ కేర్ అంటున్న ఏపీ ప్రభుత్వం.. కాగ్‌ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ అప్పుల్లో టాప్

అనేక ఏళ్లపాటు ఆర్థిక మంత్రిగా పని చేసి.. ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్షనాయకుడిగా ఉన్న యనమల రామకృష్ణుడికీ.. రాష్ట్ర రుణాలు, రాబడులు తెలుసుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో అసలు బిల్లుల బకాయిలు ఎంత ఉన్నాయో కూడా అధికారిక సమాచారం తెలియదు. ఒక ఆర్థిక సంవత్సరంలో పెండింగు బకాయిల మొత్తాన్ని తదుపరి ఏడాది బడ్జెట్‌కు బదలాయించడం లేదు.

ఆర్థికశాఖ కార్యాలయాలకు పోలీసుల భద్రత అవసరమైంది: మళ్లీ కొత్తగా విభాగాధిపతుల నుంచి ఫైలు నడపడం.. బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇవ్వడం వంటి ప్రక్రియ మొత్తం నిర్వహించాల్సి రావడంతో.. గత సంవత్సరాల్లో ఎంత మేర పెండింగు బిల్లులు ఉన్నాయో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికశాఖ అధికారులు తమ కార్యాలయానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అసలు పారదర్శకత అన్న పదమే బ్రహ్మపదార్థంగా మారింది.

జగన్ సర్కారు తీరుపై కాగ్ తన నివేదికలో ఏం పేర్కొంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.