ETV Bharat / state

గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు - అండగా ఉంటానని పట్టించుకోని సీఎం జగన్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 8:40 AM IST

YSRCP Government Not Sanction houses to Tribals: రాష్ట్రంలోని గిరిజనులు సరైన గూడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు అందించలేదు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొద్దొగొప్పో ఇళ్లు కేంద్రం మాంజూరు చేసినవే. అయితే గత ప్రభుత్వాలు గిరిజనుల ఇళ్ల కోసం నిర్వహించిన పథకాలు, కార్యక్రమాలన్నీ ఇప్పటి అధికార ప్రభుత్వం నీరుగార్చింది.

ysrcp_government_not_sanction_houses_to_tribals
ysrcp_government_not_sanction_houses_to_tribals

గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు - అండగా ఉంటానని పట్టించుకోని సీఎం జగన్​

YSRCP Government Not Sanction houses to Tribals: జగన్‌ తాను అండగా ఉంటానంటే నమ్మి గెలిపించిన గిరిజనులు ప్రస్తుతం ఆయనను నమ్మె స్థితిలో లేరు. తమ నియోజకవర్గాల్లో ఆయన పార్టీనే గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారినీ ముంచేశారు జగన్‌. తాను మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌, గిరిజనులకు గూడు మాత్రం కల్పించలేకపోయారు.

లక్షల్లో స్థలాలిచ్చాం. ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంతగూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంత నియోజకవర్గాల్లో వైఎస్సార్​సీపీనీ గెలిపిస్తున్నా ఆ విశ్వాసాన్నీ చూపించలేదు. సొంత గూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు.

సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం

రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52 వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత జగన్‌ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టు డాంబికాలు మాత్రం పలుకుతున్నారు.

"ఆదివాసీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేక వారు పూరి గుడిసెల్లో, పెంకుటిళ్లలో, రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. సరైన ఇంటి వసతి లేక రాత్రి పూట నిద్రిస్తున్న సమయాల్లో పాముకాటుకు గురై మరణించిన ఘటనలున్నాయి." -రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు

అట్టహాసంగా ఇళ్లకు శంకుస్థాపన - పూర్తి చేయకుండానే మధ్యలో నిలిపివేత
జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు. కానీ, నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 17 వేల ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32 వేలమంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నారంటే ఆదివాసీలపై జగన్‌కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది.

ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు. వాటిని గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటునిచ్చింది.

టిడ్కో లబ్ధిదారులకు షాక్ ఇస్తున్న బ్యాంకర్లు - ఇళ్లు అప్పగించకముందే రుణ వాయిదా నోటీసులు

మైదాన ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 2 లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25 లక్షలు, ఆదివాసీలకు 2.5 లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గాలకు అందే సాయంతో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది. కానీ వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహనిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్‌ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థికసాయాన్నీ కొనసాగించలేదు. ఆ పథకాలనే రద్దుచేసి గిరిజనులకు మొండిచేయి చూపించారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి - మా ఇళ్లను కాపాడండి! అన్నమయ్య జిల్లా గుంజన నది తీరం ప్రజలు

"గత ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసింది. ఈ ప్రభుత్వం పీఎంకేవీవై కింద ఇస్తున్న నిధులకు, వైఎస్సార్సీపీ కొంత మొత్తం కలిపి ఇస్తోంది. అది ఏ మూలనా సరిపోవడం లేదు." -దీసారి గంగరాజు, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు

"గత టీడీపీ హయంలో చాలా ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మధ్యలో ఆగిన ఇళ్లకు బిల్లుల చెల్లించలేని స్థితిలో ఉంది." -దొన్నుదొర, టీడీపీ ఎస్టీ సెల్‌ నాయకుడు

ధర్మవరంలో ఉద్రిక్తత - నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చేందుకు సిద్దమైన అధికారులు, అడ్డుకున్న పరిటాల ‍శ్రీరామ్‌

ఇళ్లు కట్టేందుకు కేంద్రం డబ్బులివ్వాలి, వాటిని తానే కట్టించినట్లు గోడలపై ఫొటోను ముద్రించుకుని ప్రచారం చేసుకోవాలి. ఇదీ జగన్‌ తీరు. పెరిగిన ధరల దృష్ట్యా ఇల్లు కట్టుకోడానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా జగన్‌ పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లోని పీవీటీజీలకు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకుగాను పీఎమ్‌-జన్‌మన్‌ పేరుతో కేంద్రం 2024 జనవరి నుంచి కొత్త పథకాన్ని తీసుకురానుంది.

పీఎమ్‌ఏవై గ్రామీణ్‌ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 1.2 లక్షలు ఇస్తోంది. పీఎమ్‌-జన్‌మన్‌ కింద ఒక్కో ఇంటికీ 2.4 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఆదివాసీలకు అదనపు సాయం అవసరమని కేంద్రం గుర్తించినా జగన్‌కు మాత్రం ఆ ఆలోచనే లేదు. తాను ప్యాలెస్‌ వీడకుండా గడప, గడపకు వెళ్లమని ఎమ్మెల్యేలను పురమాయిస్తున్నారు.

గడప గడపకు వెళుతున్న పాడేరు, అరకు, రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యేలకు గిరిజనుల నుంచి సొంతింటి తలపోటు తప్పడం లేదు. మిగిలిన గిరిజన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. అరకు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 12 వేల మంది గిరిజనులకు, పాడేరు నియోజకవర్గంలో 9 వేలు, రంపచోడవరంలో 11 వేల మంది గిరిజనులకు సొంతిల్లు లేదని అక్కడి అధికారులు గుర్తించారు. మిగిలిన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వేల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయాల్సిన పరిస్థితే ఉంది.

సమస్యలకు నిలయంగా జగనన్న కాలనీలు-మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారుల విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.