ETV Bharat / state

కేంద్ర బడ్జెట్​పై వైసీపీ నాయకులు ఏమన్నారంటే..!

author img

By

Published : Feb 1, 2023, 5:10 PM IST

Updated : Feb 1, 2023, 5:40 PM IST

buggana
బుగ్గన

YCP Leaders On Budget: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్​పై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. కరోనా తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాజకీయాలకు అతీతంగా అందరూ స్వాగతించాలని.. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్టం సూచించిన అనేక అంశాలను కేంద్రం బడ్జెట్‌లో చేర్చిందన్నారు. ఐతే రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో ఇప్పుడే ఏం చేప్పలేమని.. క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పారు.

YCP Leaders On Budget: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందించారు. కేంద్ర బడ్జెట్‌ను మంచి బడ్జెట్ అని భావిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సలహాల మేరకు కేంద్రం కేటాయింపులు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం పాలసీ ప్రకటించారని.. ఏపీ విజ్ఞప్తితో పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచారని రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. వీటితో పాటు ఎయిర్‌పోర్టులు, పోర్టులు, హెలిప్యాడ్‌ల ఏర్పాటుతో ప్రయోజనం చేకూరుతోందని వెల్లడించారు. పన్ను మినహాయింపు రూ.7 లక్షలకు పెంచడం అభినందనీయమని.. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదని మంత్రి తెలిపారు.

పాలన వికేంద్రీకరణ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని మంత్రి బుగ్గన అన్నారు. ఒకేచోట అభివృద్ధి ఉండకూడదనే విశాఖ రాజధాని అని సీఎం జగన్ ప్రకటన చేసినట్లు ఆయన తెలిపారు. సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎం పరిపాలన కార్యాలయమని..రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెట్​పై వైసీపీ నాయకులు ఏమన్నారంటే..

విభజన చట్టం చేసి 10 ఏళ్లు పూర్తవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇంకా హామీలు అమలు చేయకపోవడం సరికాదని వైసీపీ ఎంపీలు అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ కూడా రాష్ట్రానికి నిరాశనే మిగిల్చిందన్న వారు.. హామీలపై సభలో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ను రాజకీయంగా వాడుకుంటున్నారన్న ఎంపీలు.. అలాంటిదేమీ జరగలేదన్నారు. -మిథున్‌రెడ్డి, వైసీపీ ఎంపీ


ఇవీ చదవండి:

Last Updated :Feb 1, 2023, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.