ETV Bharat / state

మహిళ ప్రతాపం.. అప్పు ఇచ్చిన వ్యక్తిపై దాడి

author img

By

Published : Jul 4, 2020, 11:56 AM IST

అప్పు ఇచ్చిన వ్యక్తిపై ఓ మహిళ దాడి చేసింది. అప్పు చెల్లించలేదని ఆమె వాహనాన్ని తీసుకెళ్లడంతో ఆగ్రహానికి గురైన మహిళ...ఇతర వ్యక్తులతో అతనిపై దాడి చేయించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో జరిగింది.

Woman assaulted by man who lent money in vinukonda
అప్పు ఇచ్చిన వ్యక్తిపై మహిళ దాడి

అప్పు ఇచ్చిన వ్యక్తిపై ఓ మహిళ ప్రతాపం చూపించింది. పదిమంది వ్యక్తులతో అతనిపై దాడి చేయించింది. గుంటూరు జిల్లా వినుకొండలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పోలా బంగారయ్య.. తనకి పరిచయస్థురాలైనా బల్లా జ్యోతికి అవసరాల నిమిత్తం అప్పుగా రూ. 42,000 ఇచ్చాడు. చాలా రోజులు అవుతుండటంతో తన డబ్బు వెనక్కి ఇవ్వాలని బంగారయ్య అడిగాడు. ఆమె ఇప్పుడిస్తా..అప్పుడిస్తా అంటూ వాయిదా వేస్తూ అతన్ని తిప్పిస్తోంది. విసుగెత్తిన అతను డబ్బుకు బదులుగా ఆమె వాహనాన్ని తీసుకెళ్లాడు. దీంతో ఆమె పదిమందితో కలిసి రాళ్లు, కర్రలతో బంగారయ్యపై దాడి చేసిందని బాధితుని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారయ్య ఆరోగ్యం విషమంగా ఉందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. కొవిడ్ ఆస్పత్రిలో అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యం...వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.