ETV Bharat / state

తాడేపల్లిలో ఆటోను తగులబెట్టిన గుర్తుతెలియని దుండగులు

author img

By

Published : Jan 7, 2021, 7:05 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను తగులబెట్టారు. రహదారి పక్కనే ఉంచిన ఆటో తెల్లవారుజామున చూసేసరికి పూర్తిగా కాలిపోయింది. మంటల్లో పూర్తిగా కాలిపోయిన ఆటోను చూసి యజమాని దుర్గాప్రసాద్​ కన్నీటి పర్యంతమయ్యారు.

unidentified persons who set auto on fire
ఆటోను తగులబెట్టిన గుర్తుతెలియని దుండగులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో రహదారి పక్కనే ఉంచిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. స్థానికులు గుర్తించేలోపు ఆటో పూర్తిగా దగ్ధమైంది. రాత్రి రోడ్డు పక్కన పెట్టిన యజమాని దుర్గాప్రసాద్.. తెల్లవారుజామున లేచే సరికి మంటల్లో పూర్తిగా కాలిపోవడాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆటోలో కూరగాయలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నామని దుర్గాప్రసాద్ భార్య జ్యోతి తెలిపారు. ఆటోలో ఉన్న కూరగాయలు సైతం కాలి బూడిదయ్యాయన్నారు. స్థానిక యువత కొంత మంది రాత్రి వేళల్లో గంజాయి సేవిస్తూ అల్లరి పనులు చేస్తున్నారని.. ఇది వారి పనేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: రూ. 39 వేల విలువైన పురుగుల మందులు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.